గర్భిణి నరకయాతన | Anita struggled three hours with delivery pains | Sakshi
Sakshi News home page

గర్భిణి నరకయాతన

Published Wed, Oct 29 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

గర్భిణి నరకయాతన

గర్భిణి నరకయాతన

గండేడ్: ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన నిండు గర్భిణి మూడు గంటలపాటు నరకయాతన అనుభవిం చింది. రంగారెడ్డి జిల్లా గండేడ్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మున్నూరు అనితకు మంగళవారం రాత్రి పురుటి నొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆటోలో గండేడ్ ఆరోగ్య కేంద్రానికి ఆమెను తీసుకొచ్చారు.

తీరా అక్కడికి వచ్చాక ఆస్పత్రికి తాళం వేసి ఉండటం చూసి సిబ్బందికి ఫోన్ చేశారు. ఇదిగో వస్తున్నాం.. అదిగో వస్తున్నాం అంటూ సిబ్బంది దాటవేత సమాధానం చెప్పడమే తప్ప ఆస్పత్రి ఛాయలకు మాత్రం రాలేదు. మూడు గంటలపాటు నరకయాతన అనుభవించిన మహిళ చివరకు ఆటోలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే గండేడ్ ఆస్పత్రిలో సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండటం లేదని, ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement