'ఏపీ కొత్త సీఎం ఎవరని చర్చించుకుంటున్నారు' | ap cabinet ministers discussing about new cm, says ts minister mahender reddy | Sakshi
Sakshi News home page

'ఏపీ కొత్త సీఎం ఎవరని చర్చించుకుంటున్నారు'

Published Wed, Jun 17 2015 3:22 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

'ఏపీ కొత్త సీఎం ఎవరని చర్చించుకుంటున్నారు' - Sakshi

'ఏపీ కొత్త సీఎం ఎవరని చర్చించుకుంటున్నారు'

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లక తప్పదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బాబు తప్పు చేశారని తెలుగు ప్రజలు సహా కేంద్ర ప్రభుత్వం కూడా నమ్మిందని, అందుకే ఆయన భయపడుతున్నారన్నారని,  అసలు విషయాన్ని పక్కనపెట్టి ఏపీ ప్రజలను రెచ్చగొట్టం ద్వారా చంద్రబాబు లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

 

బాబు అరెస్టు ఖరారు కావడంతో ప్రస్తుతం ఏపీ మంత్రులందరూ  తమ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది చర్చించుకుంటున్నారని మహేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని బలిపశువును చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement