'భువనేశ్వరి సీఎం అవుతారని టీడీపీలో చర్చ' | asannagari jeevan reddy takes on chandra babu naidu | Sakshi
Sakshi News home page

'భువనేశ్వరి సీఎం అవుతారని టీడీపీలో చర్చ'

Published Thu, Jun 18 2015 2:48 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

'భువనేశ్వరి సీఎం అవుతారని టీడీపీలో చర్చ' - Sakshi

'భువనేశ్వరి సీఎం అవుతారని టీడీపీలో చర్చ'

హైదరాబాద్:ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ మరోసారి మండిపడింది. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో సంభాషిస్తూ పట్టుబడిన చంద్రబాబుకు ప్రస్తుతం అన్ని దారులు మూసుకుపోయాయని, ఇక ఆయన జైలుకు వెళ్లే  దారొకటే మిగిలి ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, బాలరాజులు విమర్శించారు.

 

చంద్రబాబు రాజీనామా చేస్తారని.. దీనిలోభాగంగానే కొత్త ముఖ్యమంత్రి కోసం టీడీపీలో చర్చ జరుగుతుందన్నారు. ఆయన భార్య భువనేశ్వరి ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాలున్నట్లు టీడీపీలో చర్చ జరుగుతున్నట్లు వారు పేర్కొన్నారు.  గవర్నర్ కించపరిచే విధంగా మాట్లాడుతున్న ఏపీ మంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ అనుమతి ఉంటేనే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి, బాలరాజులు మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement