యథేచ్ఛగా కబ్జా
► అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములు
► పట్టా ఒకరిది, కాస్తులో మరొకరు
► చేతులు మారుతున్న విలువైన ప్రభుత్వ భూములు
► పట్టించుకోని రెవెన్యూ అధికారులు
పాలకుర్తి టౌన్ : కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంటున్నారుు. నిరుపేదలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఈ భూములపై క్రయవిక్రయాలు నిషేధమని చట్టాలు చెపుతున్నా.. యథేచ్ఛగా అక్రమాలు జరుగుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమవుతుంటే రెవెన్యూ శాఖ మొద్దు నిద్ర పోతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంగా అభివృద్ధి చెందడంతో రియల్ భూమ్ పెరిగి ప్రభుత్వ భూములకు ప్రాధాన్యం ఏర్పడింది. భూమిలేని నిరుపేదలకు 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం 265 ఎకరాల భూమిని మూడు విడతలుగా పంపిణీ చేసింది. 595 సర్వే నెంబర్‌లో 32.9 ఎకరాలు, 655లో 15.1 ఎకరాలు, 566లో 73.39 ఎకరాలు, 629లో 192.16 ఎకరాల భూములను పలు దఫాలుగా పేదలకు అసైన్డ్ చేసింది.
అరుుతే అందులో ప్రస్తుతం 75 శాతం భూములు చేతులు మారినట్లు సమాచారం. పంపిణీ చేసిన సమయంలో అధికారులు పేదలకు కొలతలు వేసి ఇవ్వలేదు. దీంతో వారు ప్రభుత్వం ఇచ్చిన భూమి కంటే అధికంగా సాగు చేసుకుంటున్నారు. పాలకుర్తి, జనగామ రోడ్డుకు ప్రభుత్వ భూమి 73 ఎకరాలు ఉండగా, లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన వారు కాస్తులో ఉండడం గమనార్హం. కొంత మంది అధిక భూమిని కలిగి ఉన్నారని గతంలో అధికారులు నిర్వహించిన సర్వేలో సైతం తేలింది.
సాగులో లేని లబ్ధిదారులు..!
పాలకుర్తి, రఘనాథపల్లి రోడ్డు పక్కన ఉన్న భూముల్లో అనర్హులుండగా పట్టాలు పొందిన లబ్ధిదారులు సాగులో లేరని తెలిసింది. విద్యుత్ సబ్‌స్టేషన్ పక్కన ఉన్న భూముల్లో రికార్డులో పేర్లు లేని కొర దరు అక్రమంగా సాగు చేసుకుంటున్నారు. కూషిగుట్ట పక్కనున్న ప్రభుత్వ భూములు సైతం కబ్జాకు గురయ్యాయి. స్టోన్ క్రషర్స్ యజమానులు కొంత భూమిని కబ్జా చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన అధికారులు... కబ్జాదారులపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రెవెన్యూ శాఖపై అవినీతి ఆరోపణలు వస్తున్నా రాజకీయ ఒత్తిళ్లతో కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకోలేకపోతున్నారనే ఆరోపణలు వస్తున్నారుు.
భూములను పరిరక్షించాలి..
కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుని ఫైర్ స్టేషన్, మోడల్ స్కూల్, ఎస్సీ హాస్టల్, ఐకేపీ భవనం, వ్యవసాయ అధికారి కార్యాయలం, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల, ఇతర ప్రభు త్వ కార్యాలయాలు నిర్మించాలని డిమాం డ్ రావడంతో గతంలో అధికారులు ఈ భూములను పరిశీలించారు. అరుుతే ఆ భూములను స్వాధీనం చేసుకోకుండా అలాగే వదిలేయడంతో ప్రస్తుతం కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యూరుు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.