వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామశివారులోని ఎస్సారెస్పీ కెనాల్లో ఆదివారం ఉదయం ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.
పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామశివారులోని ఎస్సారెస్పీ కెనాల్లో ఆదివారం ఉదయం ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సీతమ్మ(53), విజయమ్మ(49) అనే ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది ఉన్నారు. క్షతగాత్రులను హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కాగా వీరంతా ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు సమాచారం.