
వైద్యుల నిర్లక్ష్యంతో గర్భంలోనే శిశువు మృతి?
తిరుపతమ్మకు సోమవారం పురిటినొప్పులు రావడంతో భర్త అశోక్, సోదరి సమ్మక్కలు ప్రైవేటు వాహనంలో హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్ష లు చేసిన సిబ్బంది రాత్రి 8 గంటల సమ యంలో తిరుపతమ్మను చేర్చుకున్నారు. మంచంపై కాకుండా వరండాలో కటిక నేలపైనే తిరుపతమ్మను ఉంచారు. అప్పటికే ఆమెకు ఉమ్మనీరు పోతుండగా.. ఈ విషయా న్ని సమ్మక్క వైద్య సిబ్బందికి చెప్పినా పట్టిం చుకోలేదు. బతిమిలాడినా కనీసం స్పందిం చకపోవగా.. సమ్మక్కను దూషించారే తప్ప.. గర్భిణి వద్దకు వచ్చి చూడలేదు. మంగళవారం ఉదయం పరీక్షించిన వైద్య సిబ్బంది గర్భంలోనే శిశువు చనిపోయినట్లు నిర్ధారించారు.
గర్భంలోనే బిడ్డ చనిపోయినట్లు తెలుసుకున్న తిరుపతమ్మ గుండెలవిసేలా ఎడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. అయితే, కడుపులో ఉన్న మృత శిశువును మాత్రం మంగళవారం సాయంత్రం తీరికగా ఆమెకు వైద్య సహాయం అందించారు. వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే గర్భంలో శిశువు బతికేదని.. గర్భంలోనే శిశువు చనిపోయిందని తెలిసినా.. మంగళవారం సాయంత్రం వరకు వైద్యం అందించలేదని బంధువులు, భర్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.