
న్యూఢిల్లీ : బలహీన వర్గాల సంక్షేమ స్థాయి సంఘం సభ్యుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు.. లోక్‌సభ స్పీకర్ కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్భంగా బలహీన వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తానని సంజయ్ తెలిపారు. దీంతోపాటు ఓబీసీ స్టాండింగ్ కమిటీలో అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున కరీంనగర్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసిన బండి సంజయ్ టీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే.