
హైదరాబాద్: దేశసరిహద్దుల్లో అసువులు బాసిన భారతమాత ముద్దు బిడ్డలకు బుధవారం రోజున తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విషయంలో మొదటి నుంచి బీజేపీ హెచ్చరిస్తున్నా కేసీఆర్ పెడచెవిన పెట్టారు. కరోనా విషయంలో సీఎం తీరు నిద్రలో నుంచి లేచి స్టేట్మెంట్‌లు ఇస్తున్నట్లు ఉన్నాయి. మొదటి నుంచి కరోనా టెస్టులు పెంచాలని కోరుతున్నా వినకుండా రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 44 వేల టెస్టులే చేశారు. తాజాగా.. 50వేల టెస్టులు చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ వాటిని ఎలా చేస్తారో మాత్రం చెప్పరు. తన చేతకాని తనాన్ని కేసీఆర్ కేంద్రం మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: మనం కరోనా వైరస్‌ను తిప్పికొట్టగలం
సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి విచిత్రమైన ధోరణితో జోకర్‌లా వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తు గవర్నర్ ఆస్పత్రులను సందర్శిస్తుంటే సీఎం కేసీఆర్ ఎక్కడున్నాడు...? గచ్చిబౌలిలోని 1,500 పడకల టిమ్స్ హాస్పటల్ ఏమైంది..? చికిత్సలు చేయకుండా కరోనా పాజిటివ్ వచ్చిన పేషంట్‌లను ఎందుకు హోం క్వారంటైన్‌కు పంపుతున్నారు..? కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడమో లేదా ఆయుష్మాన్ భారత్‌లో చేర్చి పేద ప్రజలను కాపాడాలి. దుబాయ్‌లో చిక్కుకున్న తెలంగాణ ప్రజలను రప్పించాలి. హరితహారం కింద ప్రతి ఏటా కోటి మొక్కలు నాటుతామన్నారు. కానీ ఈ రోజు ఏమైంది. అది పూర్తిగా ఫెయిలయ్యింది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: కరోనా : మృతదేహాలకు కష్టమొచ్చె!
Comments
Please login to add a commentAdd a comment