ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వం ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో నిర్వహించిన ‘మన ఊరు.. మన ప్రణాళిక..’తో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కనీస సౌకర్యాలు, వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల తీరు బయటపడింది. వీటిని అధికారులు ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో పొందుపర్చారు. జిల్లాలో 52 మండలు ఉండగా, 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వానికి నివేదించే గ్రామస్థాయి ప్రణాళికల తయారీ శుక్రవారంతో ముగిసింది. మరో రెండు రోజుల్లో మండల స్థాయి ప్రణాళిక నివేదికలు పూర్తి చేసి, ఈ నెల 15లోగా ప్రభుత్వానికి ప్రతిపాదించే జిల్లా స్థాయి ప్రణాళిక తయారు కానుంది.
ప్రభుత్వం సేకరించిన అంశాలను ఒకసారి పరిశీలిస్తే.. పక్కా గృహాలు
జిల్లాలోని 866 గ్రామ పంచాయతీల్లో 95,700 కుటుంబాలు ఇంకా గుడిసెల్లోనే ఉంటున్నా యి. పక్కా గృహాలు లేని నిరుపేదలు కుటుం బాలు 1,06,008 ఉన్నాయి. ప్రభుత్వం ఏటా పక్కా గృహాల పేరిట ఇళ్లు మంజూరు చేస్తున్న అర్హులైన లబ్ధిదారులకు అందడం లేదు.
వ్యక్తిగత మరుగుదొడ్లు
జిల్లాలోని గ్రామాల్లో 6,11,226 ఇళ్లు ఉన్నాయి. ఇందులో వ్యక్తిగత మరుగుదొడ్లు గల ఇళ్లు 1,66,049, వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండి ఉపయోగించని ఇళ్ల సంఖ్య 25,708 ఉన్నాయి. ఇందులో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని ఇళ్లు 4,28,346 ఉన్నాయి. అయితే అధికారులు 3,96,945 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
వివిధ రకాల పింఛన్లు
జిల్లాలో ప్రస్తుతం 65 ఏళ్లు దాటిన వృద్ధులు 1,41,298 మంది ఉన్నారు. వృద్ధాప్య పింఛన్ మంజూరైన వారు 1,01,707 మంది ఉన్నారు. అర్హత కలిగి ఉండి పింఛన్లు రాని పేద వారు 1,84,464 మంది ఉన్నారు. గ్రామాల్లో వితంతువులు 82,231 మంది ఉన్నారు. ప్రస్తుతం పింఛన్లు మంజూరైన వితంతువులు 60,039 మంది ఉన్నారు. అర్హత కలిగి ఉండి పింఛన్లు రాని వితంతువులు 76,978 మంది ఉన్నారు.
వికలాంగులు 31,998 మంది ఉన్నారు. పింఛన్లు మంజూరైన వికలాంగులు 20,656 ఉన్నారు. అర్హత కలిగి ఉండి పింఛన్ రాని పేద వికలాంగులు ఇంకా 58,787 మంది ఉన్నారు. 1,265 మంది చేనేత కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. పింఛన్లు మంజూరైన చేనేత పనివారు 443 మంది ఉన్నారు. ఇంకా 447 మందికి అర్హత ఉన్న రావడం లేదు.
రేషన్ కార్డులు
జిల్లాలోని గ్రామాల్లో అర్హత ఉండి తెలుపు రేషన్ కార్డులు లేని కుటుంబాలు 1,14,905 ఉన్నాయి. గ్రామాల్లో 40,516 పింక్ రేషన్ కార్డులు ఉన్నాయి. పింక్ రేషన్ కార్డులకు అర్హత ఉన్న 3,745 మందికి కార్డులు లేవు. అన్నపూర్ణ కార్డులు 5,041 ఉన్నాయి. అర్హత ఉన్న అన్నపూర్ణ కార్డులు లేని వారు 7,407 మంది ఉన్నారు. అంత్యోదయ కార్డులు 52,210 ఉన్నాయి. అర్హత ఉండి అంత్యోదయ కార్డులు లేని వారు 22,864 మంది ఉన్నారు.
బడికి వెళ్లని పిల్లలు
జిల్లాలో 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలు 3,58,840 మం ది ఉండగా, ఇందులో 9,041 మంది పిల్లలు బడికి వెళ్ల డం లేదు. ఈ లెక్కన చూసుకుంటే 20 ఏళ్లలోపు ఉన్న పిల్లలు ఇంకా 45,425 మంది బడికి వెళ్లడం లేదు.
పాఠశాలలు
జిల్లాలో పాఠశాలలు 3,071 ఉన్నాయి. ఇందులో గదులు లేని పాఠశాలలు 1,268 ఉన్నాయి. మరుగుదొడ్లు గల పాఠశాలలు 1,138 ఉంటే, మరుగుదొడ్లు లేని పాఠశాలలు 1,933 ఉన్నాయి. 1,873 పాఠశాలలకు అటస్థలాలు, 2,440 బడులకు ప్రహరీ లేవు.
చేతిపంపులు
జిల్లాలో ఇప్పటి వరకు తాగునీరు అందుబాటులో లేని గ్రామాలు 959 ఉన్నాయి. 866 గ్రామ పంచాయతీల్లో 18,84 చేతిపంపులు పని చేస్తే, 4,807 చేతి పంపులు పని చేయడం లేదు. జిల్లాలో రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకులు 1,450 పని చేస్తే, ఇంకా 630 ట్యాంకులు పని చేయడం లేదు.
కాన్పులు
2013-14 సంవత్సరంలో 8,671 కాన్పులు ఇంట్లోనే జరిగాయి.అదే ఏడాదిలో ఐదేళ్లలోపు చిన్నారులు 847 మంది చనిపోయారు. 2013-14లో కాన్పు అయిన మూడు నెలలకే చనిపోయిన తల్లులు 58 మంది ఉ న్నారు. జిల్లాలో 2,661 లింకు రోడ్లు, 662 డంపింగ్ యార్డులు, 813 ఆట స్థలాలను అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,59,152 వీధిదీపాలు పని చేస్తే, 36,431 వీధిదీపాలు పని చేయడం లేదు.
ప్రణాళిక చెప్పిన నిజాలు
Published Sat, Aug 9 2014 1:08 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement