స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున సాగిన ఉద్యమంలో బతుకమ్మ, బోనాలకు ప్రత్యేక స్థానం ఉంద ని డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండల కేంద్రంలోని రిజర్వాయర్ కట్టపై అభయాంజనేయ దేవస్థానం వద్ద గురువారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో డిప్యూటీ సీఎం రాజయ్యతో పాటు జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ హాజరయ్యారు. ముందుగా స్థానిక చౌరస్తా వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వారు అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి కాసేపు చీపుర్లతో రోడ్డును ఊడ్చారు. ఇటీవల అస్వస్థతకు గురైన స్థానిక సర్పంచ్ ఇల్లందుల ప్రతాప్‌ను అతడి నివాసంలో పరామర్శించా రు. డిప్యూటీ సీఎం రాజయ్య తన తండ్రి వెంకటయ్య స్మారకార్థం స్థానిక రిజర్వాయర్ కట్టపై మహిళలు బతుకమ్మ ఆడేస్థలంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ తల్లి, పిల్ల విగ్రహాలను ఆవి ష్కరించారు.
తర్వాత మహిళలతో కలిసి డిప్యూటీ సీఎం రాజయ్య, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ బతుకమ్మ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణంగా దేవుళ్లను పూలతో పూజించడం ఆనవాయితీ, అయితే ప్రకృతి సిద్ధంగా లభించే పూలను పూజిస్తూ పెద్ద ఎత్తున పండుగ చేసుకోవడం తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు చెప్పారు.
కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మూర్తి, ఎంపీటీసీ సభ్యుడు సంపత్‌రావు, టీఆర్‌ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, కన్వీనర్ అక్కినపెల్లి బాలరాజు, సర్పంచ్ ఇల్లందుల ప్రతాప్, నాయకులు గట్టు రమేష్, బంగ్లా శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు సిరిగిరి శ్రీనివాస్, గన్ను నర్సింహులు, ఎండీ.ఖాజామొహీనొద్దీన్, జొన్నల రాజేశ్వరరా వు, తెల్లాకుల రామకృష్ణ, గోలి రాజశేఖర్, కుంభం కుమార్, పెసరు సారయ్య, చింత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమంలో బతుకమ్మ, బోనాలు ప్రత్యేకం
Published Fri, Oct 3 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM
Advertisement
Advertisement