కేసీఆర్‌వి మాయమాటలు
- నమ్మి మోసపోవద్దు
- కేంద్రమంత్రి జైరాం రమేష్
ఆత్మకూరు, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌వి మాయ మాటలు.. నమ్మి మోసపోవద్దని కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం పరకాల కాంగ్రెస్ అభ్యర్థి ఇనగాల వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని చెప్పారు.
కేసీఆర్ బిడ్డకోసీటు, కొడుక్కో సీటు, అల్లుని కో సీటు ఇచ్చి.. తానూ రెండుసీట్లు తీసుకున్నాడు.. ఇది కుటుంబ పాలనకు నిదర్శనమన్నారు. ఎంపీ రాజయ్యతోపాటు పన్నెండు మంది నాలుగేళ్లు తెలంగాణ సాధనకోసం అహర్నిశలు శ్రమించారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 20 జిల్లాలు ఏర్పాటు చేస్తుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలతోపాటు మహిళలకు, యువతకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్సేనని పేర్కొన్నారు.
మహిళలకు రూ.లక్ష ఆర్థిక సాయం, వృద్ధులు, వికలాంగులకు పింఛన్ రూ.వేయి అందజేస్తామని తెలిపా రు. ముందుగా కేసీఆర్ నుంచి తెలంగా ణ విముక్తి పొందాలని కోరారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వెంకట్రాంరెడ్డిని, ఎంపీగా రాజయ్యను గెలి పించాలని, సైకిల్, కారుకు పంచర్ కావ డం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎంపీ రాజయ్య, ఏఐసీసీ ఎస్సీసెల్ చైర్మన్ కొప్పుల రాజు, డీసీసీ ఇన్‌చార్జ్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సాంబారి సమ్మారా వు, రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాహురే రాజేశ్వర్‌రావు, సర్పంచ్ సామ్యేల్, సంజీవరెడ్డి, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.
బలహీన వర్గాలకు ప్రాధాన్యం
నర్సంపేట : బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇచ్చి కృషి చేస్తోంది.. అందులో భాగంగానే నర్సంపేట నుంచి కత్తి వెంకటస్వామికి అవకాశం కల్పించినట్లు కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కత్తి వెంకటస్వామి, పార్లమెంట్ అభ్యర్థి బలరాంనాయుక్‌లను గెలిపించాలని కోరుతూ శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనం తరం జీఆర్ గార్డెన్‌లో జరిగిన కార్యకర్త ల సవూవేశంలో ఆయున మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఓ సవుుద్రంలాంటిది.. అందులోకి కొత్తవారు రావడం, పోవడం సాధారణమే.. వెళ్లిపోయిన వారిని మళ్లీ తీసుకోవడం ఉండదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొంతవుంది కాంగ్రెస్ కార్యకర్తలు జైరాం రమేష్ ప్రసంగానికి అడ్డుతగులుతూ ఎంపీ అభ్యర్థి బలరాం నాయుక్ పార్టీ వ్యక్తికి కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థి దొంతి వూధవరెడ్డికి వుద్దతు పలుకుతున్నాడని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బలరాంనాయక్‌ను గెలిపించి పార్లమెంట్‌కు పంపాలని కార్యకర్తలను కో రారు.
కార్యక్రవుంలో కొప్పుల రాజు, జంగా రాఘవరెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ అధ్యక్షుడు నారుుని రాజేందర్‌రెడ్డి, యూదగిరి, సత్యనారాయుణగౌడ్, సాంబయ్యుగౌడ్, పంజాల రాజు, సోల్తి సారయ్యు, సాయికువూర్, పంజాల రావుు తదితరులు పాల్గొన్నారు.