పక్కనే మంజీరా..ఐనా అగచాట్లే! | Beside manjira also get's problems | Sakshi
Sakshi News home page

పక్కనే మంజీరా..ఐనా అగచాట్లే!

Published Tue, Aug 11 2015 11:43 PM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

పక్కనే మంజీరా..ఐనా అగచాట్లే!

పక్కనే మంజీరా..ఐనా అగచాట్లే!

తలవంపునే మంజీరా ఉన్నా.. పట్టణమంతా ఆ నీరు తాగుతున్నా.. ఈ కాలనీకి మాత్రం బోరునీరే దిక్కవుతోంది. నాయ కులు కనీసం మంజీరా నీరే ఇప్పిం చలేకపోయారు. పైపులైన్లు వేసినా.. కొందరు నీరు సరఫరా కాకుండా అడ్డుకుంటున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.
- మంజీరా నీరు ఎరుగని గణేష్‌నగర్
- తాగునీటికోసం ఎన్నో పాట్లు
- రోడ్డు తప్ప అన్నీ సమస్యలే..
- డెంగీ వచ్చినా.. పట్టించుకునే వారేలేరు..
సంగారెడ్డి మున్సిపాలిటీః
కాలనీలలోని వివిధ ప్రాంతాలలో  కోటి రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించినా.. మురికి కాల్వలు లేకపోవడంతో నీరంతా ఎక్కడికక్కడే నిల్వఉంటుంది. ఫలితంగా ప్రతి వర్షాకాలంలో డెంగీవ్యాధికి గురవుతున్న వారిలో అధికంగా ఈ కాలనీ వాసులే ఉన్నారు. తాజాగా మరో ఐదుగురు డెంగీ వ్యాధితో వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కనీసం రాత్రి వేళల్లో లైట్లు వెలుగలేని పరిస్థితి నెలకొంది. గణేష్‌నగర్ రాత్రివేళల్లో అంధకారంతో దర్శనమిస్తోంది. కొత్తవారెవరైనా వస్తే చీకట్లో ఇండ్లను వెతుక్కోవలసిన పరిస్థితి నెలకొంది.

పేరుకు ఎస్టీ రిజర్‌‌వడ్ అయిన ఈ వార్డు అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. ఈ వార్డు నుంచి గెలుపొందిన కౌన్సిలర్, మున్సిపల్ వైస్‌చైర్మన్ అయినప్పటికీ కనీసం మంజీరా తీరు తాపించలేని పరిస్థితి ఏర్పడింది. పట్టణంలో అత్యధికంగా గిరిజనులు ఉంటున్న ఈ కాలనీ కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంది. కానీ అభివృద్ధి మాత్రం ఎరగడం లేదు. కాలనీలో 2500 మంది ఓటర్లు న్నారు. ఐదు కాలనీలున్న ఏఒక్కకాలనీలో కూడా కనీస సౌకర్యాలు లేవు. గణేష్‌నగర్, ఆనంద్‌ఆర్ట్స్, సిద్దార్థనగర్,  నారాయణరెడ్డి కాలనీ, మార్క్స్‌నగర్‌లలో మురికి కాల్వ వ్యవస్థ అధ్వానంగా ఉంది. కనీసం కచ్ఛాకాలువలైన (తాత్కాలిక కాలువలైన) లేకపోవడం వల్ల మురికి నీటితో పాటు వరదనీరు సైతం రోడ్లపైనే ప్రవహిస్తుంది.  దీనికి తోడు పందులు సంచరించడంతో పాటు దోమల బెడద అధికమై అంటువ్యాధులు ప్రబలుతున్నాయి.
 
మోడల్ కాలనీగా అభివృద్ధి చేస్తాం.. వైస్ చైర్మన్ గోవర్ధన్
పట్టణంలోని అన్ని వార్డులకు ఆదర్శంగా 21వ వార్డును అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్‌చైర్మన్ గోవర్ధన్ నాయక్ తెలిపారు. ఇప్పటికే కోటిరూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. మురికి కాల్వల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని నిధులు రాగానే పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. కాలనీనీ మాడల్ కాలనీగా తీర్చిదిద్దేందుకే  రోడ్ల నిర్మాణం పూర్తిచేయడం జరి గిందని తెలిపారు. ఈ విడతలో మురికి కాల్వల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. మంజీరా నీటి విషయంలో కొంత జాప్యం జరిగిందని సాంకేతికత కారణంగా సరఫరా చేయడం లేదన్నారు.
 
అభివృద్ధి కోసం ప్రతిపాదనలు.
.
పట్టణంలోని ఎస్టీ రిజర్వ్‌డ్ అయిన 21 వార్డును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపించాం. రూ. 10 లక్షలు సీసీ డ్రైన్‌కోసం నిధులు మంజూరయ్యాయి. టెండర్ వేయించి పనులు ప్రారంభిం చాల్సి ఉంది. మురికికాల్వలు, మంజీరా నీటి కోసం అవసరమైన నిధుల మంజూ రు కోసం ప్రతిపాదనలు పంపించాం.
 - గయాసొద్దీన్, మున్సిపల్ కమిషనర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement