Waste streams
-
పక్కనే మంజీరా..ఐనా అగచాట్లే!
తలవంపునే మంజీరా ఉన్నా.. పట్టణమంతా ఆ నీరు తాగుతున్నా.. ఈ కాలనీకి మాత్రం బోరునీరే దిక్కవుతోంది. నాయ కులు కనీసం మంజీరా నీరే ఇప్పిం చలేకపోయారు. పైపులైన్లు వేసినా.. కొందరు నీరు సరఫరా కాకుండా అడ్డుకుంటున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. - మంజీరా నీరు ఎరుగని గణేష్‌నగర్ - తాగునీటికోసం ఎన్నో పాట్లు - రోడ్డు తప్ప అన్నీ సమస్యలే.. - డెంగీ వచ్చినా.. పట్టించుకునే వారేలేరు.. సంగారెడ్డి మున్సిపాలిటీః కాలనీలలోని వివిధ ప్రాంతాలలో కోటి రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించినా.. మురికి కాల్వలు లేకపోవడంతో నీరంతా ఎక్కడికక్కడే నిల్వఉంటుంది. ఫలితంగా ప్రతి వర్షాకాలంలో డెంగీవ్యాధికి గురవుతున్న వారిలో అధికంగా ఈ కాలనీ వాసులే ఉన్నారు. తాజాగా మరో ఐదుగురు డెంగీ వ్యాధితో వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కనీసం రాత్రి వేళల్లో లైట్లు వెలుగలేని పరిస్థితి నెలకొంది. గణేష్‌నగర్ రాత్రివేళల్లో అంధకారంతో దర్శనమిస్తోంది. కొత్తవారెవరైనా వస్తే చీకట్లో ఇండ్లను వెతుక్కోవలసిన పరిస్థితి నెలకొంది. పేరుకు ఎస్టీ రిజర్వడ్ అయిన ఈ వార్డు అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. ఈ వార్డు నుంచి గెలుపొందిన కౌన్సిలర్, మున్సిపల్ వైస్‌చైర్మన్ అయినప్పటికీ కనీసం మంజీరా తీరు తాపించలేని పరిస్థితి ఏర్పడింది. పట్టణంలో అత్యధికంగా గిరిజనులు ఉంటున్న ఈ కాలనీ కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంది. కానీ అభివృద్ధి మాత్రం ఎరగడం లేదు. కాలనీలో 2500 మంది ఓటర్లు న్నారు. ఐదు కాలనీలున్న ఏఒక్కకాలనీలో కూడా కనీస సౌకర్యాలు లేవు. గణేష్‌నగర్, ఆనంద్‌ఆర్ట్స్, సిద్దార్థనగర్, నారాయణరెడ్డి కాలనీ, మార్క్స్‌నగర్‌లలో మురికి కాల్వ వ్యవస్థ అధ్వానంగా ఉంది. కనీసం కచ్ఛాకాలువలైన (తాత్కాలిక కాలువలైన) లేకపోవడం వల్ల మురికి నీటితో పాటు వరదనీరు సైతం రోడ్లపైనే ప్రవహిస్తుంది. దీనికి తోడు పందులు సంచరించడంతో పాటు దోమల బెడద అధికమై అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. మోడల్ కాలనీగా అభివృద్ధి చేస్తాం.. వైస్ చైర్మన్ గోవర్ధన్ పట్టణంలోని అన్ని వార్డులకు ఆదర్శంగా 21వ వార్డును అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్‌చైర్మన్ గోవర్ధన్ నాయక్ తెలిపారు. ఇప్పటికే కోటిరూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. మురికి కాల్వల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని నిధులు రాగానే పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. కాలనీనీ మాడల్ కాలనీగా తీర్చిదిద్దేందుకే రోడ్ల నిర్మాణం పూర్తిచేయడం జరి గిందని తెలిపారు. ఈ విడతలో మురికి కాల్వల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. మంజీరా నీటి విషయంలో కొంత జాప్యం జరిగిందని సాంకేతికత కారణంగా సరఫరా చేయడం లేదన్నారు. అభివృద్ధి కోసం ప్రతిపాదనలు.. పట్టణంలోని ఎస్టీ రిజర్వ్డ్ అయిన 21 వార్డును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపించాం. రూ. 10 లక్షలు సీసీ డ్రైన్‌కోసం నిధులు మంజూరయ్యాయి. టెండర్ వేయించి పనులు ప్రారంభిం చాల్సి ఉంది. మురికికాల్వలు, మంజీరా నీటి కోసం అవసరమైన నిధుల మంజూ రు కోసం ప్రతిపాదనలు పంపించాం. - గయాసొద్దీన్, మున్సిపల్ కమిషనర్ -
పనులు 20 శాతం కూడా పూర్తి కాలేదు
- నాలాలు శుభ్రం చేసే పనులు మందకోడిగా సాగుతున్నాయి - ఆగ్రహం వ్యక్తం చేసిన బీఎంసీ కార్పొరేటర్లు - 40 శాతం పనులు పూర్తయ్యాయన్న కార్పొరేషన్ సాక్షి, ముంబై: నగరంలో మురికి కాల్వలు, నాలాలు శుభ్రపరిచే పనులు 20 శాతం కూడా పూర్తికాలేదని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా మే మాసం వచ్చే సరికి 50 శాతం మురికి కాల్వలు, నాలాల పనులు పూర్తవుతాయని, కానీ ఈ ఏడాది ఇప్పటి వ రకు పనులు అనుకున్న మేర జరగలేదని కార్పొరేటర్లు ఆరోపించారు. వర్షాకాలానికి ఇంకా నెల రోజులు కూడా సమయం లేదని హెచ్చరించారు. నగరంలో 1.75 లక్షల మురికి కాల్వలు 45 పెద్ద నాలాలు, 38 చిన్న నాలాలు ఉన్నాయి. వీటిలో పేరుకుపోయిన చెత్త, బురద వెలికితీసే పనులు 40 శాతం పూర్తయ్యాయని బీఎంసీ పరిపాలన విభాగం వెల్లడించింది. కాని వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని బీఎంసీలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఆంబేకర్ ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో నాలాల నుంచి బయటకు తీసిన బురద, చెత్త అలాగే పడి ఉందని, దీంతో దుర్గంధం వ్యాపించడంతో ప్రజలనుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో పనులు మందకోడిగా సాగుతున్నాయన్నారు. ఇచ్చిన సమయానికల్లా కాంట్రాక్టర్లు పనులు పూర్తిచేయాలని నిబంధనలు ఉన్నాయని, అయితే వర్షాకాలం ప్రారంభమైన తర్వాత కూడా నాలాలు శుభ్రం చేసే పనులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. -
ప్రాణాలు పణంగా ‘పారిశుద్ధ్యం’!
మురికికాల్వలు, చెత్తకుప్పల పక్కన ఒక ఐదు నిమిషాలు నిలబడటానికే అల్లాడిపోతాం.. అటువంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ నగరాన్ని రోగాల బారినుంచి రక్షణ కల్పిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది మాత్రం పలు రోగాలతో అర్ధంతరంగా తనువు చాలించాల్సి వస్తోంది... గత ఐదేళ్లలో సుమారు 14 వందల మంది పారిశుద్ధ్య సిబ్బంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో ఊహించుకోవచ్చు.. సాక్షి, ముంబై: నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న బీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ లేకుండా పోయింది. కార్పొరేషన్ ద్వారా అందుతున్న అరకొర మందులు, ఇతర రక్షణ సామగ్రి కొరత కారణంగా వారు అనారోగ్యానికి గురవుతున్నారు. ఫలితంగా అర్థాంతరంగా వారి ప్రాణాలు హరీ మంటున్నాయి. చెత్త తొలగించడం, మురికి కాల్వలు, నాలాలు శుభ్రం చేయడానికి బీఎంసీలో సుమారు 35 వేల కార్మికులు ఉన్నారు. ఇందులో కొందరు కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నారు. నిత్యం వీరు చెత్త తొలగించడం, మురికి కాల్వల్లో పనిచేయడంవల్ల విధుల్లో చేరిన 15-20 సంవత్సరాల్లోనే ఆనారోగ్యం పాలవుతున్నారు. చెత్త, మ్యాన్ హోల్స్‌లో దిగడం, మురికి నీరు నుంచి వచ్చే దుర్గంధాన్ని భరించలేక అనేక మంది కార్మికులు గుట్కా, పాన్, పొగాకు, మద్యం లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. వీరు చేస్తున్న పనివిధానాన్ని బట్టి చూస్తే బీఎంసీ పరిపాలన విభాగం తగిన రక్షణ సదుపాయాలు కల్పించడం లేదని స్పష్టమవుతోందని బీఎంసీలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఆంబేకర్ అన్నారు. అత్యధిక శాతం పారిశుద్ధ్య కార్మికులు 50-55 ఏళ్ల వయసులోనే మృత్యువాత పడుతున్నారు. గడిచిన ఐదేళ్లలో ఏకంగా 1,356 మంది సఫాయి కార్మికులు మృతి చెందారు. ‘మ్యాన్ హోల్స్‌లో దిగి పనిచేసేందుకు కార్మికులకు తగిన రక్షణ కవచాలు ఇప్పటికీ అందుబాటులో లేవు. వీరు అందులో దిగినప్పుడు తప్పనిసరిగా ఆక్సిజన్ మాస్కులు వాడాల్సి ఉంటుంది. అయితే అవి అందుబాటులో ఉండకపోవడంతో మామూలుగానే మ్యాన్‌హోల్స్‌లో దిగుతూ.. వాటిలో ఉత్పతయ్యే విషవాయువులను పీల్చుకుని అందులోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు కోకొల్లలు...అయినప్పటికీ బీఎంసీ తగిన పరికరాలు వారికి అందజేయడం లేద’ని ఆంబేకర్ ఆరోపించారు. సాధారణంగా ఈ పనులు చేయడానికి ఎవరూ ముందుకురారు. మత్తులో ఉంటే తప్ప మ్యాన్ హోల్స్‌లో దిగడం, చెత్తను తరలించే సాహసం చేయరు. అందుకే వీరంతా చెడు వ్యాసనాలకు బానిసలవుతున్నారు. మృతుల సంఖ్య తగ్గించాలంటే నెలకు ఒకసారి వారి ఆరోగ్యాన్ని పరిక్షించాల్సిన అవసరం ఎంతైన ఉందని అంబేకర్ స్పష్టం చేశారు. వారు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం బిళ్లలు, టానిక్‌లు ఉచితంగా పంపిణీ చేయాలని ఆయన సూచించారు. -
మొక్కుబడిగా పారిశుధ్య వారోత్సవాలు
సాక్షి, మంచిర్యాల : సామాన్యుల కోసం చేపడుతున్న కార్యక్రమాలు అధికారులు, పాలకుల తీరుతో నీరుగారి పోతున్నాయి. లక్ష్యం నెరవేరడం మాట దేవుడెరుగు మొక్కుబడిగా సాగుతున్నాయి. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. గత నెల 23 నుంచి 30 వరకు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పారిశుధ్య వారోత్సవాలు జరిగాయి. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం కింద పనులు చేపడతామని పురపాలక వర్గాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా మురికి కాల్వలు శుభ్రం చేయడం, చెత్తను తొలగించడం, శివారు కాలనీల్లో మురుగునీటి వ్యవస్థను చక్కదిద్దడం, రోడ్ల వెంట చెత్తకుండీలు ఏర్పాటు చేయడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించిన పురపాలకవర్గాలు ఆదిలో కొంత క్రియాశీలంగానే పనులు చేపట్టాయి. అయితే తర్వాత యథావిధిగా అలసత్వాన్ని ప్రదర్శించాయి. ప్రధాన ప్రాంతాల్లో నుంచి తొలగించిన చెత్త శివారు కాలనీల్లో వేయడంతో సదరు కాలనీ వాసులు ఈ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మునిసిపాలిటీ వర్గాలతో వాదనలకు దిగిన ఘటనలు పలుచోట్ల జరిగాయి. పా రిశుద్ధ వారోత్సవాలతోపాటు సాధారణ సమయంలోనూ సేకరించిన చెత్తను మంచిర్యాల మున్సిపాలిటీ అధికారులు సమీపంలోని బైపాస్ రోడ్డులో పారబోసేవారు. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం దాటిన తర్వాత ఉన్న నివాసాల సమీప స్థలం ఈ తంతుకు వేదికగా మారింది. ఈ వ్యవహారం స్థానికులను ఇబ్బందులకు గురిచేయడంతో వారు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఒకవైపు రోడ్డు చుట్టూ మొరం పోస్తూ, మొక్కలు నాటుతుంటే అదే రోడ్డుకు ఇవతల వైపు చెత్త పారబోయటం ఏంటని ప్రశ్నించారు. శాశ్వత చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉంటే జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌తోపాటు వాణిజ్య కేంద్రమైన నిర్మల్లోనూ పారిశుధ్యం షరామామూలుగా అ ధ్వానంగానే ఉంది. మరో మూడు మున్సిపాలిటీల్లోనూ పారిశుద్ధ వా రోత్సవాల ఫలితంతో సదరు మున్సిపాలిటీలు పూర్తి స్థాయిలో బాగుపడ్డ దాఖలాలు లేవు. అదికారులను ఈ విషయమై సంప్రదించగా పారిశుధ్య వారోత్సవాల సమయంలో వరుసగా వచ్చిపడ్డ పలు పనుల ఒత్తిడిలతో పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేదని పేర్కొంటున్నారు. శాశ్వత డంపింగ్‌యార్డులతో పరిష్కారం తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు ఇటీవల పురపాలక వర్గాలతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో నీటి సరఫరాతోపాటు పారిశుధ్యం ముఖ్య అంశంగా చర్చకొచ్చింది. రాబోయే వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అదే సమయంలో శాశ్వత చెత్త డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించాలని అధికారులను సూచించారు. అయినా ఇప్పటికీ ఒకటి రెండు చోట్ల కూడా ఈ స్థల గుర్తింపు జరగలేదని తెలుస్తోంది. శాశ్వత డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి, పారిశుధ్యం, చెత్త తరలింపుపై శ్రద్ధ తీసుకొని తమ ఇక్కట్లు తొలగించాలని పుర ప్రజలు కోరుకుంటున్నారు.