మోమిన్‌పేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ.వి.రంగా ఉత్తమ పోలీస్ అవార్డుకు ఎంపికయ్యారు. మోమిన్‌పేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఏప్రిల్ 29, 2014న బదిలీపై వచ్చారు.
మోమిన్‌పేట: మోమిన్‌పేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ.వి.రంగా ఉత్తమ పోలీస్ అవార్డుకు ఎంపికయ్యారు. మోమిన్‌పేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఏప్రిల్ 29, 2014న బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి మూడు నెలల్లోనే ఆయన పరిధిలోని 15 కేసుల్లో 6హత్య కేసుల మిస్టరీని ఛేదించి నిందితులను రిమాండ్‌కు పంపాడు.
ఆయన ప్రతిభను గుర్తించిన డిపార్ట్‌మెంట్ ఎ.వి.రంగాను ఉత్తమ పోలీస్ అవార్డుకు ఎంపిక చేసింది. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆయన అవార్డును తీసుకోనున్నారు.