బైక్‌లను చాకచక్యంగా కొట్టేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టు నిజామాబాద్ జిల్లా బోధన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
జుక్కల్: బైక్‌లను చాకచక్యంగా కొట్టేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టు నిజామాబాద్ జిల్లా బోధన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన జుక్కల్ పోలీస్ స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. జుక్కల్ మండలం శివ్వాపూర్ గ్రామానికి చెందిన నవనాథ్ కొన్ని రోజులుగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. వాహనాల తనిఖీల సందర్భంగా తాను వాడుతున్న వాహనానికి సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో పోలీసులు అతడ్ని విచారించారు.
దీంతో సంగారెడ్డి, పటాన్‌చెరు, నారాయణ్‌ఖేడ్ ప్రాంతాల్లో పలు ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు తెలిసింది. జుక్కల్‌కు చెందిన సందీప్, మారుతి ఇతడికి సహకరించడంతో... ముగ్గురినీ అదుపులోకి తీసుకుని వారు విక్రయించిన పది బైక్‌లను కొనుగోలు చేసిన వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.