
సాక్షి, హైదరాబాద్: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుంచి కారు పల్టీ కొట్టిన ప్రమాదంలో మృతి చెందిన పసల సత్యవాణి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని అందించింది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన సత్యవాణి కుమార్తె నాగప్రణీత పేరు మీద ఉన్న చెక్కును ఆమె మేనమామ చక్రవర్తి అందుకున్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో చెక్కును అందజేశారు. ఇదే ప్రమాదంలో తుంటి ఎముక విరిగి కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అనంతపురం జిల్లాకు చెందిన కుబ్ర బేగం(23)కు వైద్య సేవల కోసం ఇప్పటికే రూ.3.50 లక్షలు చెల్లించామని మేయర్ తెలిపారు. ఆమె పూర్తిగా కోలుకునే వరకయ్యే ఖర్చులను జీహెచ్‌ఎంసీ తరఫున భరిస్తామన్నారు.
చెక్కు అందజేస్తున్న మేయర్ రామ్మోహన్
గత నెల 23న బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో సత్యవాణి దుర్మరణం పాలయ్యారు. ఏడాదిగా మణికొండలో ఉంటున్న ఆమె కుమార్తె ప్రణీతతో కలిసి అద్దె ఇల్లు కోసమని, కూకట్‌పల్లిలోని బంధువులను కలిసేందుకు వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు. కళ్లెదుటే తల్లి సత్యవేణిని పొగొట్టుకున్న ప్రణీత (26) స్వల్ప గాయాలతో బయటపడింది. ఆరు నెలల క్రితం నగరానికి వచ్చి ఉద్యోగాన్వేషణలో ఉన్న అనంతపురం జిల్లా యువతి కుబ్ర బేగం తీవ్రంగా గాయపడి కోలుకుంటోంది. ఆటో డ్రైవర్ ముడావత్ బాలూ నాయక్(38) ఎడమ కాలి పాదం పూర్తిగా దెబ్బతింది.
సంబంధిత వార్తలు..
బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం
డిజైన్ లోపమేనా?
Comments
Please login to add a commentAdd a comment