గచ్చిబౌలి: బయో డైవర్సిటీ ఫ్లైవర్‌పై పరిమితికి మించి దూసుకెళితే వాత తప్పదు. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై వాహనదారులు పాటించాల్సి నిబంధనలను ఆదివారం సైబరాబాద్ పోలీసులు విడుదల చేశారు. ఎస్‌ఆర్‌డీపీ–సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై అదనపు భద్రతా చర్యల్లో భాగంగా మార్గదర్శకాలు రూపొందించారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఐబీఎం వద్ద బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పైకి వచ్చే వాహనదారులు సూచికల బోర్డులను తప్పక చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సూచికలు చూడకుండా వెళ్లి గీత దాటినా, వేగంగా వెళ్లినా జరిమానా తప్పదని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ద్విచక్ర వాహనదారులు ఎడమ వైపు లేన్‌లో మాత్రమే వెళ్లాలి. కుడి వైపు లైన్ దాటినా , వేగంగా వెళ్లినా, మధ్యలో ఆపినా సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా చలానా విధిస్తారు. ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ లేకుండా బైక్ నడిపినా ఈ–చలానా తప్పదు. కార్లు కుడి వైపు ఉన్న లేన్‌లో మాత్రమే వెళ్లాలి, ఎడమ వైపు లైన్ దాటినా, 40 కిలో మీటర్ల వేగం మించినా ఫైన్ కట్టాల్సిందే. అంతే కాకుండా ఫ్లైఓవర్‌పై ఎవరూ వాహనాలను నిలుపరాదు, ఎదురుగా నడుచుకుంటూ వెళ్లడం నిషేదం. సెల్ఫీల కోసం ఆగినా చలానా విధిస్తారు. ఫ్లై ఓవర్‌పై పాదచారులు వెళితే జరిమానా తప్పదు. భారీ వాహనాలు, బస్సుల రాకపోకలను నిషేధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
చదవండి : బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై రాకపోకలు షురూ!
Comments
Please login to add a commentAdd a comment