కరెంట్ కోతలను నిరసిస్తూ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. జహీరాబాద్ సబ్‌స్టేషన్ ధర్నా నిర్వహించి ఏడీఏ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు.
జహీరాబాద్ టౌన్: కరెంట్ కోతలను నిరసిస్తూ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. జహీరాబాద్ సబ్‌స్టేషన్ ధర్నా నిర్వహించి ఏడీఏ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీ సులు వీరిని స్టేషన్‌కు తరలించారు. వివరాలు.. కరెంట్ కోతలను నిరసిస్తూ బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మల్లికార్జున్‌పాటిల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆ పార్టీ శ్రేణులు జహీరాబాద్ సబ్ స్టేషన్ ధర్నా నిర్వహించాయి. అంతకు ముం దు స్థానిక అతిథి గృహం నుంచి సబ్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్‌పాటిల్ మా ట్లాడుతూ.. మండల పరిధిలోని రైతులు వందల ఎకరాల్లో చెరకు, అల్లం, పసు పు, అరటి తదితర పంటలను సాగుచేశారని తెలిపారు.
అయితే కరెంట్ కోతల వల్ల ఇవి ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి రెండు మూడు గంటలకు మించి కరెంట్ ఇవ్వడంలేదన్నారు. రాత్రీపగలు లేకుండా కోతలు విధిస్తున్నారని తెలిపారు. ట్రాన్స్‌కో ఏడీఈ తులసీరాం నాయకులతో ఫోన్‌లో మాట్లాడుతూ... వ్యవసాయానికి 7 గంటల కరెంట్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని త్వరలో కరెంట్ సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. ధర్నాలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బస్వరాజ్‌పాటిల్, మండల అధ్యక్షుడు శేఖర్, పట్టణ ఉపాధ్యక్షుడు శివ, కార్యదర్శి అజయ్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, విశ్వనాథ్ యాదవ్, నరేష్, బండి వెంకట్ పాల్గొన్నారు.