
ఎంపీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
చేతులకు సంకెళ్లతో వినూత్న నిరసన
హుస్నాబాద్: హుస్నాబాద్‌ను జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి ఎంపీ వినోద్‌కుమార్ మాట నిలబెట్టుకొవాలని స్థానిక జిల్లా సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం జిల్లా సాధన సమితి నాయకులు చేతులకు సంకెళ్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ ఎన్నికల ముందు హుస్నాబాద్ జిల్లా కేంద్రం ఏర్పాటుకు అన్ని అవకాశాలున్నాయని ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారని అన్నారు. ఎన్నికల ముందు ఎవరు అడగకముందే హామీలు గుప్పించి, ప్రస్తుతం జిల్లాల పునర్విభజన పేరుతో ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని విమర్శించారు. కరువు దృష్టిని మళ్లించేందుకే సీఎం కేసీఆర్ జిల్లాల లొల్లి తెరపైకి తెచ్చాడని అన్నారు.
రాజకీయ సౌలభ్యం కోసం నియోజకవర్గాన్ని, మండలాలను చీలిస్తే ప్రజలు వ్యతిరేక పోరాటాలు చేస్తారని అన్నారు. హుస్నాబాద్‌ను జిల్లా చేయడం వీలుకాకపోతే, హుస్నాబాద్‌కు ఆర్డీఓ కార్యాలయం మంజూరు చేసి కరీంనగర్‌లోనే హుస్నాబాద్‌ను ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షను పరిగణలోకి తీసుకొని కొత్త జిల్లాల ఏర్పాటును ప్రకటించాలని లేనిపక్షంలో ప్రత్యేక జిల్లా కోసం పోరుబాట తప్పదని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు బొలిశెట్టి శివయ్య, డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, హుస్నాబాద్ జిల్లా సాధన సమితి కన్వీనర్ అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, కో కన్వీనర్లు దొడ్డి శ్రీనివాస్, వరయోగుల శ్రీనివాస్, కాంగ్రెస్,బీజేపీ, టీడీపీ నాయకులు చిట్టి గోపాల్‌రెడ్డి, అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, పచ్చిమట్ల రవీందర్, అక్కు శ్రీనివాస్, మల్లేశం, ముప్పిడి రాజిరెడ్డి, గొర్ల వెంకన్న, వెంకటస్వామి, సతీష్ పాల్గొన్నారు.