రెవెన్యూ, ఐసీడీఎస్, పోలీసుల రాకతో కళ్లెంలో బాల్య వివాహానికి బ్రేక్
కళ్లెం(లింగాలఘణపురం) : పెళ్లి పీటల వరకు వచ్చిన బాలిక వివాహం రెవెన్యూ, ఐసీడీఎస్, పోలీస్ అధికారుల రాకతో అర్ధాంతరంగా ఆగి పోరుున సంఘటన మండలంలోని కళ్లెం గ్రా మంలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నా యి. మండలంలోని కళ్లెంకు చెందిన కీర్తన యాదగిరి, ఎల్లమ్మ దంపతుల కుమారుడు యాదగిరితో మోత్కూరుకు చెందిన చిటుకూరి రాము లు, రేణుకల కుమార్తి మౌనికకు వివాహం కుది రింది. ఆదివారం ఉదయం 11 గంటల కు వివాహం నిశ్చయం కావడంతో ఇరువురి బంధువులు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహం జరిగే సమయానికి గుర్తుతెలియని వ్యక్తులు ఐసీడీఎస్ ఆర్‌జేడీ శైలజకుమారికి ఫోన్ చేసి మైనర్ బాలికకు వివాహం జరుగుతోందని, అడ్డుకోవాలని సమాచారమిచ్చారు.
దీంతో హుటాహుటీ న సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు జనగామ ఆర్‌డీఓ వెంకట్‌రెడ్డికి విషయం సమాచారమిచ్చారు. ఆయన ఆదేశాలతో ఎస్సై వెంకటేశ్వర్‌రావు, ఆర్‌ఐ శ్రీనివాస్ గ్రామానికి చేరుకుని వివాహాన్ని ఆపివేయాలని ఆదేశిం చారు. పెళ్లి నిలిపివేస్తున్నట్లు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడంతో అధికారులు వెనుతిరిగారు. ఏసీడీపీఓ వినీత, సూపర్‌వైజర్ శ్రీలత సంఘటన స్థలానికి వచ్చి బాలికను వారి వెంట తీసుకెళ్లారు.
లబోదిబోమన్న బాధితులు
వివాహం నిలిచిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ల బోదిబోమంటున్నారు. పెళ్లి కోసం అన్ని సిద్ధం చేసుకున్నామని, భోజనాలు కూడా ఏర్పాటు చేసుకొని తీరా లగ్నం సమయంలో మైలపోలు తీస్తున్న సందర్భంగా అధికారులు వచ్చి ఆపి వేయడంతో ఆవేదనకు గురయ్యారు.
పీటలపై ఆగిన పెళ్లి
Published Mon, Feb 23 2015 12:41 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement
Advertisement