నల్గొండ: జిల్లాలోని మోత్కురు మండలం దత్తప్పగూడెంలో దారుణం చోటు చేసుకుంది. భూతగాదాల కారణంగా ప్రభాకర్ అనే వ్యక్తిని కొంతమంది దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. వేటకొడవళ్లతో దాడి చేసిన ప్రత్యర్థులు ప్రభాకర్ అనే వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. దీంతో స్థానికంగా భయానక పరిస్థితులు అలుముకున్నాయి.
గత కొంతకాలంగా వారి మధ్య నడిస్తున్న విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఈ ఘోరం చోటు చేసుకుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.