వ్యక్తి దారుణ హత్య | Brutal murder in Mahabubnagar | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Published Sat, Jul 25 2015 6:52 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

Brutal murder in Mahabubnagar

అయిజ (మహబూబ్‌నగర్ జిల్లా) : పాత కక్షల నేపథ్యంలో 15 మంది దుండగులు ఒక వ్యక్తిని వేటకోడవళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన శనివారం మహబూబ్‌నగర్ జిల్లా అయిజ మండలం మేడికొండ గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. మేడికొండ గ్రామానికి చెందిన బోయ పెద్దయ్య(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా శనివారం పొలం పనుల్లో ఉండగా 15 మంది గుర్తుతెలియని దుండగులు అతనిపై దాడికి దిగారు.

తమ వద్ద ఉన్న వేటకోడవళ్లతో అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. దీంతో పెద్దయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement