ఓ బీటెక్ విద్యార్థి తోటి వారి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయాడు.
ఓ బీటెక్ విద్యార్థి తోటి వారి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారం గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి కుమారుడు రాకేష్‌రెడ్డి (20) బీటెక్ చదువుతున్నాడు. అతడు బుధవారం రాత్రి జవహర్‌నగర్‌లోని స్నేహితుల గదికి వచ్చాడు. స్నేహితులు అతడి నోటికి గుడ్డ కట్టి తీవ్రంగా కొట్టారు. గొంతుకోసి హతమార్చారు. గురువారం ఉదయం విషయం గమనించిన ఆ ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ వెంకటగిరి సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. నిందితులు పరారీలో ఉన్నారు. డబ్బు కోసమే ఈ ఘాతుకం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.