
రైల్వే స్టేషన్‌లో గంజాయి స్వాధీనం
వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. రైలులో తరలించడానికి సిద్ధంగా ఉన్న ఆరుగురిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు.