గ్యాస్ సబ్సిడి వినియోగంపై కేసు నామోదు | Case filed on Gas subsidy working staff | Sakshi
Sakshi News home page

గ్యాస్ సబ్సిడి వినియోగంపై కేసు నామోదు

Published Thu, Jun 25 2015 11:23 PM | Last Updated on Sat, Aug 11 2018 8:18 PM

భైంసా పట్టణంలోని కృపా ఇండియన్ గ్యాస్‌లో పని చేసే కంప్యూటర్ సిబ్బందిపై వంట గ్యాస్ సబ్సిడి దుర్వినియోగం చేయడంపై గురువారం చిటింగ్ కేసునామోదు చేసినట్లు పట్టణ సీఐ వాసుదేవరావు తెలిపారు.

భైంసా(ఆదిలాబాద్ జిల్లా): భైంసా పట్టణంలోని కృపా ఇండియన్ గ్యాస్‌లో పని చేసే కంప్యూటర్ సిబ్బందిపై వంట గ్యాస్ సబ్సిడి దుర్వినియోగం చేయడంపై గురువారం చిటింగ్ కేసు నామోదు చేసినట్లు పట్టణ సీఐ వాసుదేవరావు తెలిపారు. భైంసా గ్యాస్ ఏజెన్సిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసే కీర్తిరతన్ వంట గ్యాస్ వినియోగదారుల భ్యాంక్ ఖాతాల్లో జమ చేయవలసిన సబ్సిడి నగదును తన బందువుల ఖాతాల్లోకి మళ్ళించారని పిర్యాదు అందిందన్నారు .

రూ.ఒక లక్షకు పైగానే వినియోగదారుల సబ్సిడి సోమ్మును తన సంబందికుల బ్యాంకు ఖాతాల్లోకి మళ్ళించిన వైనంపై భైంసా ఆశాఖ మేనేజర్ అజేయ్‌కుమార్ పిర్యాదు అందజేశారని తెలిపారు. ఈ పిర్యాదు మేరకు చిటింగ్ కేసు నామోదు చేసి దర్యాప్తును చేస్తున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement