హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కానిస్టేబుల్‌కు ఆరోగ్య భద్రత కార్డు ఉన్నా వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించిన కామినేని ఆసుపత్రిపై కేసు నమోదైన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ యాదగిరి ఈ నెల 3న రాత్రి విధులు ముగించుకుని ఘట్‌కేసర్‌కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం 108లో కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
రాత్రి విధులలో ఉన్న డాక్టర్ ఎలాంటి ప్రథమ చికిత్స చేయకుండా నిర్లక్ష్యం వహించాడు. ఆరోగ్య భద్రత స్కీమ్ అగ్రిమెంట్ కలిగి ఉన్నా చికిత్స అందించకుండా డాక్టర్లు తిరస్కరించారు. దీంతో వెంటనే యాదగిరిని మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్.భద్రారెడ్డి వైద్యం అందించని కామినేని ఆసుపత్రి, విధులలో ఉన్న డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కామినేని ఆసుపత్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.