హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధం: పీపీ చౌదరి | central minister responded on high court bifurcation | Sakshi
Sakshi News home page

హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధం: పీపీ చౌదరి

Published Sun, Jun 18 2017 2:52 PM | Last Updated on Thu, Mar 28 2019 8:40 PM

హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధం: పీపీ చౌదరి - Sakshi

హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధం: పీపీ చౌదరి

హైదరాబాద్‌: హైకోర్టు విభజనపై కేంద్ర మంత్రి పీపీ చౌదరి స్పందించారు. హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు. ఆదివారాం బీజేపీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో జరిగిన న్యాయవాదుల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే ఆరుగురు హైకోర్టు జడ్జిలను నియమించనున్నట్లు తెలిపారు. హైకోర్టు కొలీజియం సిఫారసు చేస్తే మిగతా నియామకాల గురించి పరిశీలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, రామచందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. పేదల ఆర్యోగ్యానికి మోడీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గుండె శస్త్ర చికిత్సలో ఉపయోగించే స్టంట్‌లను రూ. 20 వేలకే అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర చాలా గొప్పదని  గుర్తుచేసుకున్నారు. హైకోర్టు విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టు విభజనకు పరస్పరం సహకరించుకోవాలని దత్తాత్రేయ అన్నారు. లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. మోడీ పరిపాలన పారదర్శకంగా కొనసాగుతుంటే. రాష్ట్రంలో మాత్రం నియంతృత్వ, కుటుంబ పాలన, అవినీతి పాలనా కొనసాగుతోందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement