హైదరాబాద్: కృష్ణపట్నం, హిందుజా విద్యుత్ ప్లాంట్ల నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్‌ను ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దోపిడీపై వివరణ ఇచ్చాకే చంద్రబాబు వరంగల్‌లో పర్యటించాలని మంత్రి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణకు ప్రాణాధారమైన సాగునీరు, విద్యుత్‌ను రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనను కర్ణాటక, కేరళ సీఎంల పర్యటనల మాదిరిగానే చూస్తామని, హైదరాబాద్‌లో ఉంటున్న అతిథిగానే భావిస్తామన్నారు.