'బాబు ముక్కు, మూతి, చెవులు, పళ్లు పగిలాయి' | chandrababu shouldnt do experiments in telangana | Sakshi
Sakshi News home page

'బాబు ముక్కు, మూతి, చెవులు, పళ్లు పగిలాయి'

Published Sun, May 31 2015 7:37 PM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

'బాబు ముక్కు, మూతి, చెవులు, పళ్లు పగిలాయి'

'బాబు ముక్కు, మూతి, చెవులు, పళ్లు పగిలాయి'

హైదరాబాద్: డబ్బులు రాజకీయాలను శాసిస్తున్నాయంటే దానికి చంద్రబాబునాయుడే కారణమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రాజకీయాలను కలుషితం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. రేవంత్ రెడ్డి అరెస్టు విషయంపై ఆయనను మీడియా సంప్రదించగా స్పందించారు. రాష్ట్రవతరణ నుంచి ఇప్పటి వరకు తెలంగాణను అన్ని విధాలుగా దెబ్బకొట్టాలని చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు.

టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలనే కుట్రతో తాజాగా ఆయన అనుంగు శిష్యుడు రేవంత్ రెడ్డిని రంగంలోకి దించాడని, పాపం ఆయన ప్రయత్నం బెడిసి కొట్టి ముక్కు, మూతి, పల్లు, చెవులు అన్ని పగిలిపోయాయని చెప్పారు. తెలంగాణలో ఇక చంద్రబాబు ప్రయోగాలు నడవవని ఆ ప్రయోగాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఏ ముఖం పెట్టుకుని డీజీపీని కలిసేందుకు వెళ్లారో తనకు అర్ధం కావడం లేదని చెప్పారు. అసలు పోలీసులకు ఎర్రబెల్లినే సమాచారం అందించి రేవంత్ రెడ్డిని అరెస్టు చేయించారేమోనని తనకు అనుమానం కలుగుతోందని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement