'చంద్రబాబు నీచుడు.. ఎర్రబెల్లి ఏక్ నెంబర్ దొంగ' | what tell chandrababu on revanth reddy arest | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు నీచుడు.. ఎర్రబెల్లి ఏక్ నెంబర్ దొంగ'

Published Sun, May 31 2015 7:22 PM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

'చంద్రబాబు నీచుడు.. ఎర్రబెల్లి ఏక్ నెంబర్ దొంగ'

'చంద్రబాబు నీచుడు.. ఎర్రబెల్లి ఏక్ నెంబర్ దొంగ'

హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యేలను తెలంగాణలోని అధికార పార్టీ గొర్రెల్లా పశువుల్లా కొంటుందని మహానాడులో ఆరోపణలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడేం సమాధానం చెప్తారని టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. దొంగే.. దొంగ దొంగ అన్నట్లు ఉందని చెప్పారు. ఎమ్మెల్యే స్టీఫెన్కు లంఛం ఇస్తుండగా అవినీతి నిరోధకశాఖ పోలీసులు టీడీపీ నేత రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు.

ప్రజస్వామ్యం సిగ్గుతో తలదించుకునేలా టీడీపీ వ్యవహారం ఉందని చెప్పారు. చంద్రబాబు కంటే నీచుడెవరూ ఉండరని, ఎర్రబెల్లి ఏక్ నెంబర్ దొంగ అని తలసాని తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి విషయంలో అధికారపార్టీ కుట్ర చేసిందని టీడీపీ చేస్తున్న ఆరోపణలు ఆయన కొట్టిపారేశారు. క్యాంపులో ఉన్న రేవంత్ రెడ్డి బయటకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement