చంద్రబాబువి నీతిమాలిన రాజకీయాలు
♦ మేం టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు సంతలో
♦ పశువులు కొన్నట్టు అన్నావుగా: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
♦ ఇప్పుడు ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నావు?
♦ వారికి ఎన్ని డబ్బులిచ్చావు.. ఏం ప్రలోభపెట్టావు?
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం ఎవరినైనా బలి చేయడానికి వెనకాడ రని, నీతిమాలిన రాజకీయాలు చేయడంలో దిట్టని తెలం గాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మం డిపడ్డారు. తాము టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు సంతలో పశువులను కొన్నట్లు కొంటున్నారని, రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఆయన.. ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఏం సమాధానం చెబుతారన్నారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే బిగాల గణేశ్‌తో కలసి తలసాని విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
బాబూ.. సమాధానం చెప్పు?
మా చేరికలపై విమర్శలు చేస్తూ తానొక్కడినే సత్య హరిశ్చంద్ర మహారాజులా పోజులు కొట్టి న చంద్రబాబు ఇప్పుడు ఏపీలో పార్టీ ఫిరాయింపులపై ఏంచెబుతారు? టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలని సవాళ్లు విసిరావు. ఇప్పుడు ఏపీలో టీడీపీలో చేరిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్తావా? మేం టీఆర్‌ఎస్‌లో చేరగానే అవాకులు చవాకులు పేలిన టీటీడీపీ సన్నాసులు ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై నోరు విప్పాలి. నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీని టీడీపీలో ఏ రాజ్యాంగ నిబంధనల మేరకు చేర్చుకున్నారో చంద్రబాబు చెబితే విని తరిస్తాం.
రాజీనామా చేయిస్తావా.. లేదా?
పరిటాల రవి, బాంబుల శివారెడ్డి ఎపిసోడ్ అందరికీ తెలుసు. రవి హత్య నేపథ్యంలో అసెంబ్లీలో ఎన్ని గొడవలు చేశారు? ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘానికి, లోక్‌సభ స్పీకర్‌కు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయలేదా? కేసులు పెట్టమని గొడవ చేయలేదా? పరిటాల రవి ఎలా చనిపోయిండు? జేసీ దివాకర్‌రెడ్డి మనుషుల మీద కేసులు పెట్టాలని నీవు అనలేదా? మేం నీలాగా రక్తం తాగే వ్యక్తులం కాదు. నీ రాజకీయం కోసం ఫ్యాక్షన్ వైరుధ్యాలు ఉన్న రెండు కుటుం బాల మధ్య కూడా చిచ్చు పెడుతున్నావు. మేం మంచి కాజ్ కోసం టీఆర్‌ఎస్‌లో చేరాం. ఎంత నీచమైన భాష మాట్లాడినవ్. ఇప్పుడు ఏమేం సెటిల్ చేశావు.. ఎంత డబ్బులిచ్చావ్? ఏం ప్రలోభ పెట్టావు? ఇప్పుడు మీ పార్టీలో చేరిన వారితో రాజీనామాలు చేయించి ఎన్నికలకు పోతుండ్రా లేదా చెప్పాలి. నువ్వు చేస్తే నీతి.. వేరేవాళ్లు చేస్తే అవినీతా? గతంలో మాట్లాడిందానికి క్షమాపణ చెబుతావా... లేక ఆ మాటలు తప్పని అంటావా?
మేనిఫెస్టో తుంగలోకి తొక్కావ్...
బాబు నీతిమాలిన రాజకీయం గురించి శివారెడ్డి భార్య చెప్పింది. మీరంతా చూసిండ్రు. హైదరాబాద్‌లో చార్మినార్‌ను నిజాం కట్టించిండు. ఎన్టీఆర్ బుద్ధుడ్ని పెట్టాడు. ఈయనేమో హైటెక్ సిటీ కట్టించ్చిండట! సైబరాబాద్‌ను తొమ్మిదేళ్లలో పూర్తి చేసిండట! మీ ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కావు. ఏపీ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అమరావతి పేరుతో సింగపూర్, జపాన్ అంటూ ఏపీ ప్రజలకు చుక్కలు చూపెడుతున్నడు. అది వచ్చేది కాదు. పోయేది కాదు. పాపం అమాయకులు.. తెలియక జాగాలు కొనుక్కొని పరేషాన్‌లో ఉన్నరు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సనత్‌నగ ర్‌లో మూడు మీటింగులు పెట్టిండు. బుద్ధి రావాలంటే ఓడగొట్టాలన్నడు. ఏమైంది..? మేం పార్టీ మారినప్పుడు మాట్లాడిన మాటలు నీకు వర్తిస్తయా లేదా? వర్తిస్తే.. రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తావా లేదో చెప్పాలి.