నా జోలికి వస్తే బాబు జాతకం బయటపెడతా | talasani srinivas yadav takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

నా జోలికి వస్తే బాబు జాతకం బయటపెడతా

Published Wed, Oct 29 2014 1:23 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

నా జోలికి వస్తే బాబు జాతకం బయటపెడతా - Sakshi

నా జోలికి వస్తే బాబు జాతకం బయటపెడతా

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. తన జోలికి వస్తే చంద్రబాబు జాతాకాన్ని రోజుకొకటి  చొప్పున బయటపెడతానని ఆయన హెచ్చరించారు. తలసాని బుధవారం కేసీఆర్ కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ 'సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు' అన్న ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు గాలికి వదిలేశారన్నారు.

కాంట్రాక్టరే దేవుడు, వ్యాపారస్తుడే సమాజంగా చంద్రబాబు భావిస్తున్నారని తలసాని విమర్శించారు. కాగా తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్ తదితరులు ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement