revanth reddy arest
-
వెంటనే పోలీసు ఉద్యోగాల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నియామకాల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ మాదిరి రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. శుక్రవారం సచివాలయంలో పోలీసు, వైద్యారోగ్య శాఖల్లో నియామకాలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా, అవకతవకలకు ఆస్కారం లేకుండా చేపట్టాలని స్పష్టం చేశా రు. నియామకాల ప్రక్రియలో లోటుపాట్లను అధిగమించే అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక స్కూళ్లు విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడి ఉండే, ఎక్కువ సమయం విధులు నిర్వహించే పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల నుండి కానిస్టేబుల్ వరకు, ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుండి కండక్టర్, కిందిస్థాయి ఉద్యోగుల పిల్లలకు చదువుకొనేలా ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ఆ పాఠశాలలు ఉండాలని.. ఉత్తర, దక్షిణ తెలంగాణలలో వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వెంటనే హోంగార్డుల నియామకాలు పోలీసు శాఖలో ఏడెనిమిదేళ్లుగా హోంగార్డుల నియామకాలు లేవని, సమర్థవంతమైన పోలీసు సేవల కోసం వెంటనే హోంగార్డుల నియామకాలు చేపట్టాలని డీజీపీని సీఎం ఆదేశించారు. హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం హోంగార్డుల సేవలను మరింతగా వినియోగించుకోవాలన్నారు. మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగమివ్వండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి పోలీసుశాఖలో అదే ఉద్యోగం ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ఉన్నతాధికారులను సీఎం ప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే చేర్చుకోవాలని సీఎస్, డీజీపీలకు సూచించారు. పోలీస్ శాఖలో ఉద్యోగానికి సంబంధించి అవరోధాలేమైనా ఉంటే.. అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు. గతంలో ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఈ సమీక్ష సమావేశాల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎంను కలిసిన ముస్లిం పెద్దలు శుక్రవారం మాజీ మంత్రి షబ్బీర్ అలీ నేతృత్వంలో పలువురు ముస్లిం మత పెద్దలు, నాయకులు సచివాలయంలో సీఎం రేవంత్‌ను కలసి సన్మానించారు. మైనారిటీల సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలను అందచేశారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులొద్దు తన కాన్వాయ్ ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ జామ్‌లతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙంచాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. రోడ్డు పై మూడు, నాలుగు లేన్లు ఉంటే.. ఒక లేన్‌లో సీఎం కాన్వాయ్ వెళ్లేలా చూడాలని సూచించారు. కాన్వాయ్‌లో ప్రస్తుతమున్న 15 వాహనాల సంఖ్యను 9కి తగ్గించాలన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని, తరచూ సమస్య లున్న చోటుకు వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా చూడాలని ఆదేశించారు. సీఎం సమీక్ష తర్వాత హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
అంతిమ యాత్రకు బయలుదేరిన రేవంత్ రెడ్డికి షాకిచ్చిన పోలీసులు
-
ఎస్సై ఫిర్యాదు, రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు
బంజారాహిల్స్ (హైదరాబాద్): టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బుధవారం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రోడ్లను బ్లాక్ చేసి, రాకపోకలకు అంతరాయం కలిగించారని జూబ్లీహిల్స్ ఎస్ఐ యాకన్న ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ ఉత్సాహం.. సిటీలో ట్రాఫిక్ నరకం పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా పోలీసులు ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడంతో బుధవారం నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో హడావుడిగా మధ్యాహ్నం వీటిని జారీ చేశారు. అప్పటికే కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ అభిమానుల వాహనాలతో గాంధీభవన్ రోడ్డు నిండిపోవడంతో ఆ చుట్టుపక్కల మార్గాల్లో ప్రయాణించిన నగర జీవి నరకం చవిచూశాడు. ట్రాఫిక్ మళ్లింపులపై ముందురోజే ఆంక్షలు విధించడం ఆనవాయితీ. అయితే ఎందుకో ఈ సారి విస్మరించారు. బుధవారం మధ్యాçహ్నానికే అబిడ్స్, కోఠి, నాంపల్లిలతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వాహనాలు పెద్ద సంఖ్యలో ఆగిపోయాయి. అప్పుడు మేల్కొన్న ట్రాఫిక్ పోలీసులు గాంధీభవన్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు అంటూ నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. -
శాంతిభద్రతల కోసమే రేవంత్ అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకోవడంలో ఎక్కడా కూడా చట్ట నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఎన్నికల సమయంలో వికారాబాద్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించిన అన్నపూర్ణ హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించే చర్యల్లో భాగంగానే రేవంత్‌ని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. కోస్గిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హాజరవుతున్న సభ లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతోనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, అందువల్ల అధికారిక సీలు అందుబాటులో లేకపోయిందని వివరించారు. అదుపులోకి తీసుకునే ముందు బయటకు రావాలని రేవంత్‌ను పలుమార్లు పిలిచామని, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో గేట్లు పగులగొట్టి లోనికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. గదిలో రేవంత్‌తోపాటు ఆయన భార్య, కుమార్తె ఉన్నారని, వారికి రేవంత్ అరెస్ట్‌కు దారి తీసిన కారణాలు వివరించి వాటికి సంబంధించిన కాగితాలపై సంతకాలు కోరగా నిరాకరించారని ఆమె తెలిపారు. పోలీసులు చట్ట విరుద్ధంగా రేవంత్‌ను నిర్బంధించారని, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాదికి అవకాశం ఇచ్చి తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
అధికార పార్టీ అధ్యక్షుడిని నిర్బంధించగలరా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు అధికా ర పార్టీ అధ్యక్షుడిని చేయగలరా? అని హైకోర్టు బుధవారం పోలీసులను ప్రశ్నించింది. రేవంత్ అరెస్టు విషయంలో పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోలేదని వ్యాఖ్యానించింది. రేవంత్‌తో ముఖ్యమంత్రి సభకు ఇబ్బంది కలుగుతుందని భావించినప్పుడు అతన్ని గృహ నిర్బంధం చేసి ఉండొచ్చునని, గడప దాటరాదని ఆంక్షలు విధించి ఉండొచ్చునని పేర్కొంది. చట్టం నిర్దేశించిన విధి విధానాలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి అరెస్టు చేయడం అభ్యంతరకరమని పేర్కొంది. టీఆర్ఎస్ ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) పంపిన లేఖపై కూడా రజత్‌కుమార్ సంతకం లేకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రేవంత్ నిర్బంధానికి దారి తీసిన పరిస్థితులు, నిఘా నివేదికలు, తేదీలు తదితర అంశాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, గడువునివ్వాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ పదే పదే అభ్యర్థించడంతో కోర్టు అందుకు అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ హాజరయ్యేలా చూడండి... సీఎం సభను జరగనివ్వనని రేవంత్ ప్రకటించారని, అల్లరిమూకలను పంపి ఘర్షణలు సృష్టించాలన్నది ఆయన వ్యూహమని, అందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని ఏజీ చెప్పారు. దీనికి ధర్మాసనం స్పంది స్తూ, అధికార పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష పార్టీ సభలను జరగనివ్వనని చెబితే ఆ కారణంతో పోలీసులు నిర్బంధించగలరా? చట్టం ముందూ అందరూ సమానమేనంటూ అధికార పార్టీ అధ్యక్షుడిని నిర్బంధించే తెగువ పోలీసులకు ఉందా అని ప్రశ్నించింది. రేవం త్ని అర్ధరాత్రి నిర్బంధించాలని ఎస్పీకి ఎవరు చెప్పారని, డీజీపీ అటువంటి ఆదేశాలు ఇచ్చారా అని ప్రశ్నించింది. ఈ విషయంలో తాము స్వయంగా డీజీ పీ నుంచి స్పష్టత తీసుకోవాలని భావిస్తున్నామంది. మధ్యాహ్నం 2.15కి తమ ముందు డీజీపీ హాజరయ్యే లా చూడాలని ఏజీకి ధర్మాసనం పేర్కొంది. నోట్ ఫైళ్లపైనే సంతకాలు, సీలు.. మొదట సరేనన్న ఏజీ, ఆ తరువాత డీజీపీ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పారు. కోర్టు ఆదేశించిన తరువాత ఆయన ఎక్కడున్నా కూడా తమ ముందు హాజరు కావాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీంతో డీజీపీ మహేందర్‌రెడ్డి కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం నేరుగా డీజీపీ నుంచి కొన్ని వివరణలు అడిగింది. టీఆర్ఎస్ ఫిర్యా దు మేరకు తెలంగాణ సీఈవో తమకు లేఖ రాశారని, కొడంగల్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుం డా చర్యలు తీసుకోవాలని కోరారని, దీనిలో భాగం గానే చర్యలు తీసుకున్నామని డీజీపీ చెప్పారు. నిఘా అధికారులు, ఎస్పీకి మధ్య జరిగిన సంప్రదింపుల డాక్యుమెంట్లపై తేదీలు, సంతకాలు, ఆఫీసు సీలు లేకపోవడంపై ప్రశ్నించగా, నోట్ ఫైళ్లపై మాత్రమే సంతకాలు ఉంటాయని డీజీపీ చెప్పారు. ఈ సమాధానంపై ధర్మాసనం సంతృప్తి చెందలేదు. నిర్బంధం అక్రమమా? సక్రమమా? అన్నదే ముఖ్యం... ఈ సమయంలో ఏజీ స్పందిస్తూ, సంతకాలు లేనంత మాత్రాన ఓ డాక్యుమెంట్ తన విలువను కోల్పోదని, మిగిలిన ఇతర అంశాలను కూడా పరి గణనలోకి తీసుకోవాలని, ఈ మొత్తం వ్యవహారం పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. రేవంత్‌ను మంగళవారం సాయంత్రం 5.30 గంటలకే విడుదల చేశామని చెప్పగా, ఇక్కడ రేవంత్ విడుదల చేశారా? లేదా? అన్నది సమస్య కాదని, అరెస్టు సక్రమమా? అక్రమమా? అన్నదే ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది. విచారణ జరుగుతున్నంత సేపు కోర్టు న్యాయవాదులతో కిక్కిరిసిపోయింది. -
కేసీఆర్ కుట్రపన్ని రేవంత్‌ను అరెస్ట్ చేయించారు
ఏసీబీ కార్యాలయం వద్ద టీడీపీ ఆందోళన హైదరాబాద్: సీఎం కేసీఆర్ కుట్రపన్ని రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయించారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రి ఏసీబీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. విచారణ నిమిత్తం ముందుగా స్టీఫెన్‌ను ఏసీబీ కార్యాలయానికి తీసుకువచ్చిన అధికారులు అరగంట వ్యవధిలో రాత్రి 8 గంట లకు రేవంత్‌నూ తీసుకువచ్చారు. వారిని వేర్వేరు గదుల్లో విచారిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాగంటి గోపీనాథ్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, టీడీపీ నేతలు మోత్కుపల్లి నర్సింలు, పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయకుండా అడ్డుకునేందుకే రేవంత్‌ను అరెస్ట్ చేశారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఏసీబీ డీజీని కలిసేందుకు అనుమతించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏసీబీ ఆఫీసులోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నా రు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాగా, తన సోదరుడిని అక్రమంగా కేసులో ఇరికించారని, చంపేం దుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ రేవంత్ సోదరుడు కొండల్‌రెడ్డి ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నిం చగా బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
'క్షమాపణలు చెప్పి రేవంత్‌ను వదిలేయాలి'
-
కేసీఆర్ క్షమాపణలు చెప్పి రేవంత్‌ను వదిలేయాలి
హైదరాబాద్: రేవంత్ రెడ్డికి ఏం జరిగినా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుదే బాధ్యత అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి అరెస్టు అనంతరం టీ టీడీపీ నేతలు డీజీపీ అనురాగ్ శర్మ కలిశారు. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులంతా తెలంగాణ ద్రోహులేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని చంపే ప్రయత్నం జరుగుతోందంటూ ఆరోపణలు చేశారు. అసలు రేవంత్ రెడ్డి వద్ద డబ్బే దొరకలేదని, ప్రభుత్వమే కుట్ర చేసిందని చెప్పారు. వెంటనే కేసీఆర్ క్షమాపణలు చెప్పి రేవంత్ రెడ్డిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. -
'బాబు ముక్కు, మూతి, పళ్లు పగిలాయి'
-
'బాబు ముక్కు, మూతి, చెవులు, పళ్లు పగిలాయి'
హైదరాబాద్: డబ్బులు రాజకీయాలను శాసిస్తున్నాయంటే దానికి చంద్రబాబునాయుడే కారణమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రాజకీయాలను కలుషితం చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. రేవంత్ రెడ్డి అరెస్టు విషయంపై ఆయనను మీడియా సంప్రదించగా స్పందించారు. రాష్ట్రవతరణ నుంచి ఇప్పటి వరకు తెలంగాణను అన్ని విధాలుగా దెబ్బకొట్టాలని చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలనే కుట్రతో తాజాగా ఆయన అనుంగు శిష్యుడు రేవంత్ రెడ్డిని రంగంలోకి దించాడని, పాపం ఆయన ప్రయత్నం బెడిసి కొట్టి ముక్కు, మూతి, పల్లు, చెవులు అన్ని పగిలిపోయాయని చెప్పారు. తెలంగాణలో ఇక చంద్రబాబు ప్రయోగాలు నడవవని ఆ ప్రయోగాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఏ ముఖం పెట్టుకుని డీజీపీని కలిసేందుకు వెళ్లారో తనకు అర్ధం కావడం లేదని చెప్పారు. అసలు పోలీసులకు ఎర్రబెల్లినే సమాచారం అందించి రేవంత్ రెడ్డిని అరెస్టు చేయించారేమోనని తనకు అనుమానం కలుగుతోందని చెప్పారు. -
'చంద్రబాబు నీచుడు.. ఎర్రబెల్లి ఏక్ నెంబర్ దొంగ'
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యేలను తెలంగాణలోని అధికార పార్టీ గొర్రెల్లా పశువుల్లా కొంటుందని మహానాడులో ఆరోపణలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడేం సమాధానం చెప్తారని టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. దొంగే.. దొంగ దొంగ అన్నట్లు ఉందని చెప్పారు. ఎమ్మెల్యే స్టీఫెన్‌కు లంఛం ఇస్తుండగా అవినీతి నిరోధకశాఖ పోలీసులు టీడీపీ నేత రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. ప్రజస్వామ్యం సిగ్గుతో తలదించుకునేలా టీడీపీ వ్యవహారం ఉందని చెప్పారు. చంద్రబాబు కంటే నీచుడెవరూ ఉండరని, ఎర్రబెల్లి ఏక్ నెంబర్ దొంగ అని తలసాని తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి విషయంలో అధికారపార్టీ కుట్ర చేసిందని టీడీపీ చేస్తున్న ఆరోపణలు ఆయన కొట్టిపారేశారు. క్యాంపులో ఉన్న రేవంత్ రెడ్డి బయటకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. -
'దొంగే దొంగ..దొంగ అన్నట్లు ఉంది'