తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్చలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్ నుంచి 1000
హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్చలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు రాష్ట్రాల విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులు సోమవారం ఎంఓయూపై సంతకాలు చేశారు. రాయ్పూర్లో జరిగిన ఎంఓయూ సమావేశానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్తో పాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఆరుగురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.