కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో బి.వై నగర్‌లో భూవివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.
సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో బి.వై నగర్‌లో భూవివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు కత్తులు, కర్రలతో పరస్పర దాడికి దిగాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ఘర్షణకు దిగిన 30 మందిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణకు కారణమైన భూవివాదం పరిష్కారంపై పోలీసులు దృష్టి సారించారు. మరోసారి ఘర్షణ జరగకుండా చర్యలు చేపట్టారు.