
టాయిలెట్లను శుభ్రం చేసిన ఎంపీ, ఎమ్మెల్యే
మొయినాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలోని ఉన్నత పాఠశాలలో చేవెళ్ల ఎంపీ విశేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలు టాయిలెట్లను శుభ్రం చేశారు. మంగళవారం విజయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు పాఠశాలలోని టాయిలెట్లను, మరుగుదొడ్లను పరిశీలించారు. గ్రామంలోని పాఠశాల మధ్యనే మురుగునీటి కాల్వ ప్రవహిస్తుండడంతో దానిపై ఎలాంటి కప్పు లేనందున అధికారులు వెంటనే స్పందించాలన్నారు. బీసీ స్లాబ్ వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, సర్పంచ్‌ను ఆదేశించారు.