గజ్వేల్‌లో బుధవారం జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోనే కేసీఆర్ తొలి పర్యటనకు సిద్ధమైన వేళ..
గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్‌లో బుధవారం జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోనే కేసీఆర్ తొలి పర్యటనకు సిద్ధమైన వేళ.. అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఈ ఏర్పాట్లను మంత్రి హరీష్‌రావు.. కలెక్టర్ స్మితాసబర్వాల్, జాయింట్ కలెక్టర్ శరత్, ఎస్పీ శెముషీబాజ్‌పాయ్‌లతో పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సమీక్షించారు.
అనంతరం పిడిచెడ్ రోడ్డు వైపున అన్నపూర్ట రైసుమిల్లు సమీపంలోని మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుముందు గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని చౌరస్తాను సైతం మంత్రి హరీష్‌రావు, కలెక్టర్, జేసీ, ఎస్పీలతో కలిసి పరిశీలించారు.
కేసీఆర్ షెడ్యుల్ ఇదే..
మధ్యాహ్నం 1.45 నిమిషాలకు వర్గల్‌లోని విద్యాసరస్వతి ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు.
2.30 గంటలకు ప్రజ్ఞాపూర్ చౌరస్తాకు చేరుకుని బైక్ ర్యాలీలో పాల్గొంటారు.
2.30 గంటలకు గజ్వేల్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
3.30 గంటలకు ప్రజ్ఞా గార్డెన్స్‌లో నియోజకవర్గ అభివృద్ధిపై సమగ్ర సమీక్ష జరుపుతారు.
రాత్రి 7.15గంటలకు జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.