‘స్వర్ణభారత్‌’ సేవలు భేష్‌ | CM KCR comments on Svarnabharat Trust | Sakshi
Sakshi News home page

‘స్వర్ణభారత్‌’ సేవలు భేష్‌

Published Tue, Jan 17 2017 2:08 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

‘స్వర్ణభారత్‌’ సేవలు భేష్‌ - Sakshi

‘స్వర్ణభారత్‌’ సేవలు భేష్‌

  • గ్రామీణులు, నిరుద్యోగులకు విశేష సేవలందిస్తోంది: సీఎం కేసీఆర్‌
  • ట్రస్ట్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ ప్రారంభం
  • సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామీణ ప్రాంత ప్రజలు, నిరుద్యోగులకు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ విశేష సేవలందిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొనియాడారు. మహాత్ముని ఆశయాల నుంచి పురుడుపోసుకున్న ఈ ట్రస్ట్‌.. సంఘం, సమాజం పురోగమించేందుకు తనవంతు కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ట్రస్ట్‌కు ఎలాంటి సాయం అందిచడానికైనా సిద్ధంగా ఉంటామన్నారు. సోమవారం రంగా రెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ లో నెలకొల్పిన ట్రస్ట్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ను కేసీఆర్‌ ప్రారంభించారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. పల్లెల్లోనే దేశం ఉందన్న గాంధీ స్ఫూర్తిని ట్రస్ట్‌ పుణికి పుచ్చుకుందన్నారు. ట్రస్ట్‌ ద్వారా ఎంతో మం దికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పిస్తు న్నారన్నారు. ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు దీపా వెంకట్‌ తన తండ్రి వెంకయ్యనాయుడు అండతో రాజకీయాల్లోకొచ్చే అవకాశమున్నా.. అది వదిలేసి, సేవ చేయాలన్న సం కల్పంతో ముందుకెళ్లడం అభినందనీయ మ న్నారు. తండ్రి సంస్కారమే ఆమెకు అబ్బిందన్నారు.

    సర్పంచ్‌కు కోట్లు పెడుతున్నారు...
    ప్రస్తుతం మనం పిలుచుకుంటున్నట్లు పంచా యతీరాజ్‌ ఒక శాఖ కాదని, ఒకప్పుడు సాగిన బృహత్తర ఉద్యమమని సీఎం పేర్కొన్నారు. కొన్ని పరిస్థితులతో దురదృష్టవశాత్తు దాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అప్పటి రాజకీయ వ్యవస్థ.. దాన్ని ఒక శాఖగా మార్చి ఉద్యమాన్ని చంపేసింది. ఆ తర్వాత స్వార్థం తోడైంది. ఈ క్రమంలో సర్పంచ్‌గా గెలవడం కోసం.. రూ.కోట్లు ఖర్చుపెట్టే పరిస్థితులు వచ్చాయి. ఫలితంగా ఆ ఉద్యమం.. స్ఫూర్తి కనుమరుగైపోయింది. దేశానికి ప్రధాని, సీఎంలు ఇలా ఎవరేం చేసినా.. ప్రథమ స్థానంలో నిలబడి పనిచేయా ల్సింది స్థానిక సంస్థల ప్రతినిధులే. గ్రామాల సర్పంచులు, ఎంపీటీలు, ఎంపీపీలు.. వీరం తా అద్భుతంగా పనిచేసినప్పుడే దేశం వికాసం సాధిస్తుంది’’ అని అన్నారు.

    పంచాయతీరాజ్‌ వ్యవస్థలో వచ్చిన విపరిణామాలు, దుష్ప్రభావాలను సంస్కరించాలని ట్రస్ట్‌ను కోరారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సాయం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని, సేవల్ని మరింత విస్తరించడానికి తోడ్పాటు అందిస్తామని చెప్పారు. మహారాష్ట్రలో బండార్కర్‌ అనే వ్యక్తి పరిశోధనలు, చూపిన తపన ఫలితంగా ఆ రాష్ట్రం ద్రాక్ష ఎగుమతిలో గణనీయ అభివృద్ధి సాధిస్తోందని సీఎం అన్నారు. ఆయన కృషి ఫలితంగా ఏటా రూ.10 వేల కోట్ల విలువ జేసే ద్రాక్షలను ఎగుమతి చేసే స్థాయికి ఆ రాష్ట్రం ఎదిగిందన్నారు. సంఘం కోసం ఏదో చేయాలన్న తపన çఫలితమే ఇదన్నారు. ఇలా ఎందరో మహనీయులు గ్రామాలకు సేవచేశారని.. ఇదే లక్ష్యంతో ట్రస్ట్‌ పనిచేస్తోందని చెప్పారు.  

    ఇలాంటి ట్రస్టులు చాలా అవసరం...
    గ్రామీణ యువతీ యువకుల్లో స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ చైతన్యం తీసుకురావడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మహాత్ముడి కలల సాధన కోసం ట్రస్ట్‌ కృషి చేస్తోందన్నారు. పేదరికం పోవా లంటే ఇలాంటి ట్రస్టులు చాలా అవసరమ న్నారు. యువత ఉపాధి కల్పనకు కేంద్రం రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తోందన్నారు. అవగా హన, నైపుణ్యాలు లేకపోవడం వల్లే నిరుద్యోగ సమస్య వచ్చిపడిందని, మానవ వనరులు పుష్కలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ అన్నారు. ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు దీపా వెంకట్‌ మాట్లాడుతూ.. గ్రామీణులకు ట్రస్ట్‌ అండగా ఉంటుందన్నారు.

    వారు జీవితంలో స్థిరపడే బాధ్యత తమ ట్రస్ట్‌ తీసుకుంటుందని చెప్పా రు. కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీలు మల్లారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, సియంట్‌ సంస్థ అధినేత బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ట్రస్టు ఏర్పాటుకు పది ఎకరాల స్థలాన్ని విరాళంగా అందజేసిన మహా సిమెంట్, మైహోం గ్రూపు సంస్థల చైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌రావు, ఎండీ జూపల్లి జగపతిరావును సన్మానించారు.

    ప్రభుత్వం నుంచి పైసా లబ్ధి పొందలేదు: వెంకయ్య
    స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో రాజకీయాలకు ఏమా త్రం తావులేదని కేంద్రమంత్రి వెంకయ్యనా యుడు స్పష్టం చేశారు. ఇది గ్రామీణ ప్రాంత ప్రజలు, మహిళలు, నిరుద్యోగ యువతీ యువకుల్లో నైపుణ్యాలు పెంపొం దించి ఉపాధి కల్పించే ట్రస్ట్‌ అని పేర్కొ న్నారు. యువత ఉద్యోగాల కోసం కాళ్ల రిగేలా తిరగకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ట్రస్ట్‌ ద్వారా ఐటీ, ఫార్మా సంస్థల సాయంతో నిరుద్యోగుల నైపుణ్యాలకు సానబెడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం నుంచి ట్రస్ట్‌ పైసా లబ్ధి పొందలేదని, పూర్తిగా దాతల సహకా రంతోనే కొనసాగుతోందని పేర్కొన్నారు. వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా దేశ వారసత్వాన్ని, సంప్రదాయాల్ని మరిచిపోవద్దన్నారు. కన్నతల్లి, మాతృభూమి, మాతృభాష, మాతృదేశాన్ని మరిచిపోయినవారు మనుషులే కాదన్నారు. దేశంలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని.. ఈ క్రమంలో స్వల్ప ఇబ్బందులు తప్పవ న్నారు. మతం వ్యక్తిగతమని, అందరి గతం ఒక్కటే కాబట్టి కలసిమెలసి జీవించాలని చెప్పారు.

    ఆ ఉద్యమంలో నేనూ పాల్గొన్నా..
    దశాబ్దాల కిందట ఉన్న స్వచ్ఛత ప్రస్తుత గ్రామాల్లో లేదని, మురికి, కంపచెట్లు తొలిగే మార్గం కనిపించడం లేదని కేసీఆర్‌ చెప్పారు. ‘‘గ్రామీణాభివృద్ధి నిపుణులు ఎస్‌కేడే ఆధ్వర్యంలో ఒకప్పుడు పంచాయతీరాజ్‌ ఉద్యమం జోరుగా సాగింది. హైదరాబాద్‌ కేంద్రం గా  ఈ ఉద్యమాన్ని నడిపించారు. రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీ ఆయన స్థాపించిందే. పంచాయతీరాజ్‌ సమితికి తొలిసారిగా నామినేట్‌ అయిన ఇద్దరూ ఇక్కడివారే. అందులో ఒకరు ఏపీ మాజీ స్పీకర్‌ రామచంద్రారెడ్డి. ఈ సమితికి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పంచాయతీరాజ్‌ ఉద్యమం జోరుగాసాగింది. దుబ్బాకలో రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రాంచంద్రారెడ్డి సమితికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేనూ ఈ ఉద్యమంలో పాల్గొ న్నా. విద్యార్థిగా దళిత, గిరిజన వాడల్లో పారిశుధ్యంపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో వేషాలు వేశా. ఉపన్యాలు చెప్పా. తర్వాత అది కనుమరుగై గ్రామాల్లో పొడి వాతావరణంతో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి’’ అని సీఎం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement