తెలంగాణలో కొత్తగా 10 నామినేటెడ్ పోస్టులు భర్తీ
హైదరాబాద్ : తెలంగాణలో చాలా రోజులుగా ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్ పదవుల భర్తీ ఎట్టకేలకు జరిగింది. తెలంగాణ ప్రభుత్వం 10 కార్పొరేషన్లకు చైర్మన్లను నియామిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి ఉన్న నేతలు, ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నాయకులు, వారి సామాజిక సమీకరణాలు ఇలా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈసారి ఏకంగా అయిదుగురు మైనార్టీలకు స్థానం దక్కింది.
సెట్విన్ చైర్మన్ గా ఇనాయత్ అలీ బక్రీ
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా షేక్ బుడాన్
సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొండబాల కోటేశ్వరరావు
నెడ్ క్యాప్ చైర్మన్ గా అబ్దుల్ అలీమ్
ఖాధీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్ గా యుసుఫ్ జాహీద్
అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా కేకే కుమారుడు విప్లవ్
గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా అక్బర్ హుస్సేన్
హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ గా సంపత్ కుమార్ గుప్తా
ఎడ్యుకేషన్ అండ్ వెల్పేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నాగేందర్ గౌడ్ నియామకం