పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్తవేం కావు: కేసీఆర్
నల్లగొండ: పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు కొత్తవి కావని, సమైక్య రాష్ట్రంలోనే రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆదేశాలు వచ్చాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో శుక్రవారం సాయంత్రం ఆయన డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలనుద్దేశించి సీఎం మాట్లాడుతూ.. మన నీళ్లు తెచ్చుకుంటామంటే ఆంధ్రా నాయకులు నానాయాగీ చేస్తున్నారని విమర్శించారు. నిర్వాసితులకు న్యాయం చేసి ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. కాగా, భారీ జనంతో జరగాల్సిన బహిరంగసభ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడడంతో రద్దు అయింది.