
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్ దాదాపు గంట సేపు అక్కడే గడిపారు. వరుసగా అయిదు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం గవర్నర్ బుధవారం తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
ఈ భేటీలో ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఆర్టీసీ నష్టాలు పూర్వాపరాల్ని సీఎం కేసీఆర్ గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే వారిపై వేటు వేస్తామని ఈ సందర్భంగా సీఎం తీవ్రంగా హెచ్చరించారు. రైతుబంధు చెక్కుల పంపిణీ విజయవంతమైందని, బీమా పథకం అమలుకు ఎల్‌ఐసీతో ఒప్పందం చేసుకున్నామని సీఎం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ ప్రధాని నరేంద్ర మోదీ భేటీలో రాష్ట్రంలో కొత్తగా అమలు చేసిన రైతుబంధు, రైతులకు బీమా పథకాలను ప్రధానికి కూడా వివరించినట్లు తెలిసింది.