కేసీఆర్(ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమీక్ష ఏర్పాటు చేశారు. సోమవారం ప్రగతి భవన్‌లో పలువురు మంత్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. కరోనా కేసుల వల్ల రెండోసారి పదో తరగతి పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం.. వాటిని తిరిగి నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ( తెలంగాణ: టెన్త్ పరీక్షలు రద్దు?)
ఆ మూడింటి ఆధారంగా టెన్త్ అప్‌గ్రేడ్!
టెన్త్ విద్యార్థుల ఎస్‌ఏ-1, ప్రీ ఫైనల్, ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఎస్‌ఎస్‌సీ అప్‌గ్రేడ్ చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఈ మేరకు అన్ని పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. మార్కుల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపింది. ఇప్పటికే అన్ని పాఠశాలలు విద్యార్ధుల ఇంటర్నల్ మార్కులను ఎస్‌ఎస్‌సీ బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేశాయి.
Comments
Please login to add a commentAdd a comment