
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై చర్చించారు. ఈ నెల 5న కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేశారు.
కాగా, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,061 కి చేరుకోగా, 29 మంది మరణించారు.