* వేయి స్తంభాల ఆలయంలో దీక్షను విరమింపజేయండి
* జిల్లా మంత్రులను ఆదేశించిన కేసీఆర్
కొడకండ్ల : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అరగుండు, అర మీసంతో వినూత్న తరహాలో ఉద్యమానికి అంకితమైన మండలంలోని మొండ్రాయి శివారు గిర్నితండాకు చెందిన దారవత్ మోహన్‌గాంధీ నాయక్ గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలిశారు. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు ఆమరణ దీక్షలు, పాదయాత్ర నిర్వహించారు. అంతేగాక తెలంగాణ ఏర్పడే వరకు అర గుండు, అర మీసంతో ఉంటానని 1259 రోజులుగా విన్నూత దీక్షను నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రం అవిర్భవించాక దీక్షను గాంధీ విరమించాలనుకున్న తరుణంలో ఘనంగా సన్మానించి దీక్షను విరమింప చేస్తానని కేసీఆర్ చేప్పడంతో నేటికి దీక్షలో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో గాంధీ నాయక్ సీఎంను కలిశారు. దీంతో వేయిస్థంభాల గుడిలో జిల్లా మంత్రులు, నాయకుల సమక్షంలో సన్మానించి దీక్షను విరమింపజేయాలని అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం రాజయ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్‌ను సీఎం ఆదేశించారు. ఉద్యమమే ఊపిరిగా పోరాటం చేసిన నీకు తప్పక న్యాయం చేస్తానని, అధైర్యపడొద్దని తనకు సీఎం అభయం ఇచ్చారని గాంధీ నాయక్ తెలిపారు.
సీఎంను కలిసిన గాంధీ నాయక్
Published Fri, Dec 19 2014 2:32 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
Advertisement