అనుమతి లేకుంటే అంతే..!
కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు అధికారుల నోటీసులు
కరీంనగర్ ఎడ్యుకేషన్ : జిల్లాలో ఉన్నత విద్య ప్రవేశాలు, ఉద్యోగ అర్హత పరీక్షలకు శిక్షణ ఇస్తున్న కోచింగ్ కేంద్రాలకు ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాల వివరాలు సేకరించింది. అనుమతి లేకుండా 130 వరకు కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ అధికారుల ద్వారా గుర్తించింది. వీటన్నింటికీ నోటీసులు జారీ చేసింది. నెలలోగా గుర్తింపు పొందాలని, లేనిపక్షంలో కోచింగ్ కేంద్రాలు మూసివేయూలని ఆదేశించింది. అరుుతే, ఈ నోటీసులు జారీ చేసి ఇరవై రోజులు గడిచినా నేటి వరకు కేవలం 25 దరఖాస్తులే అధికారులకు అందారుు.
జిల్లాలో 130 కోచింగ్ సెంటర్లు..
జిల్లా విద్యాశాఖ అనుమతితో పాటు ప్రభుత్వ గుర్తింపు లేకుండా జిల్లా కేంద్రంలోనే సుమారు 60 కోచింగ్ కేంద్రాలు ఉన్నారుు. జిల్లా వ్యాప్తంగా మరో 70 కేంద్రాలు నడుస్తున్నాయని తేలింది. మండల విద్యాశాఖ అధికారుల ద్వారా రహస్యంగా నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యూరుు. ఉన్నత విద్య, ఉద్యోగ అర్హత ప్రవేశ పరీక్షకు శిక్షణ ఇవ్వడానికి 12 కోచింగ్‌కేంద్రాలు వెలిసినట్టుగా తేలింది. నవోదయ, కోరుకొండ, గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్షకు శిక్షణ ఇచ్చే ట్యుటోరియల్స్ అనుమతిలేకుండానే నడుస్తున్నట్లు ఎంఈవోలు గుర్తించి జిల్లా విద్యాశాఖకు నివేదించారు.
ఇవీ నిబంధనలు..
శిక్షణకు వచ్చే వారు నిరుద్యోగులు, ఉన్నత చదువులు చదివే విద్యార్థులు.
వీరంతా పెద్దవారు కావడంతో అనుకూలమైన కుర్చీలు, బల్లలు ఉండాలి.
తప్పనిసరిగా సరిపడేలా మూత్రశాలలు ఉండాలి.
విశాలమైన శిక్షణ గదులతోపాటు గాలి, వెలుతురు సౌకర్యవంతంగా ఉండాలి.
విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి.
ఉన్నతమైన గ్రంథాలయం తప్పనిసరి.
శిక్షకుల విద్యార్హతలు తప్పనిసరి. వారి విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు విద్యాశాఖ అధికారులకు అందుబాటులో ఉండాలి.
బోధకుల విద్యార్హతల్లో తేడా ఉంటే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ గుర్తింపుతోనే కోచింగ్‌కేంద్రాలను నిర్వహించాలి.
గుర్తింపు లేకుండా నడిపే వారిపై పాఠశాల విద్యాశాఖ చట్టం ప్రకారం ఆరేళ్ల నుంచి పన్నెండేళ్ల వరకు శిక్ష ఉంటుంది.
గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోడానికి ముందు రూ.వెయ్యి చలాన్ రూపంలో చెల్లించాలి.
అనంతరం రూ.10 వేలు అడ్వాన్సుగా చెల్లించాలి.
ఈసేవా ద్వారా ప్రభుత్వ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి.
పేరుకే బోర్డులు..
జిల్లాలో కొన్ని కోచింగ్ కేంద్రాలు కేవలం పేరుకే బోర్డులు పెట్టుకున్నాయి. ఇలాంటి సెంటర్లు 15కి పైగా ఉన్నత విద్య, ఉద్యోగ అర్హత ప్రవేశ పరీక్షకు కోచింగ్ ఇస్తామంటూ ప్రచారం చేస్తున్నారుు. వీటిలో పదిలోపు కూడా అడ్మిషన్లు లేవని సమాచారం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీరు బోర్డు తిప్పుకోవాల్సిందే. అనుమతి లేని ట్యుటోరియల్స్ కూడా నవోదయ, గురుకులం, కోరుకొండ ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవి. వీటిని సీజన్ ప్రకారం ప్రారంభిస్తారు. సీజన్ అయిపోగానే మూసివేస్తారు. ఇటువంటి కేంద్రాలు కూడా అనుమతి కోసం ముందుకు వచ్చే అవకాశాలు తక్కువనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నోటీసులు జారీ చేశాం
జిల్లాలోని కోచింగ్ కేంద్రాలకు ప్రభుత్వ అనుమతి లేదు. వీటి నిర్వాహకులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. ఇప్పటి వరకు 15దరఖాస్తులే అందారుు. మిగతారు సైతం దరఖాస్తు చేసుకోవాలి. లేనిపక్షంలో మూసివేస్తాం. ఇదే విషయూన్ని ఇప్పటికే స్పష్టం చేశాం.
- కె.లింగయ్య, డీఈవో