తుర్కయంజాల్: మానవత్వం మంటగలిసింది. ఓ బాలింత మృతదేహాన్ని అద్దె ఇంటికి తీసుకు రాకుండా కాలనీవాసులు అడ్డుకున్నారు. చివరకు చేసేదేమీలేక బాధిత కుటుంబీకులు మృతదేహాన్ని ఇంటికి తీసు కెళ్లకుండా చెరువు వద్దకు తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటన శనివారం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లోని వైఎస్సార్ నగర్ (ఇంది రమ్మ) కాలనీలో జరిగింది. ఆమనగల్ మం డలం ఆకుతోటపల్లికి చెందిన జి.మల్లికార్జున్‌రావు భార్య మాలతి(30)తో కలసి వైఎస్సార్ నగర్ కాలనీలో అద్దెకుంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
మాలతి 26 రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం అనారోగ్యానికి గురైన మాలతి శుక్రవారం సాయంత్రం తుర్కయం జాల్‌కు తీసుకొచ్చారు. అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన మాలతి ఇంట్లోనే మృతి చెందింది. దీంతో ఉదయం అంత్యక్రియల కోసం మాలతి కుటుంబ సభ్యులు అద్దెకుం టున్న ఇంటి ఎదుట టెంట్ వేస్తుండగా కాలనీవాసులు అడ్డుకున్నారు. అమావాస్య రోజున చనిపోయిన బాలింతను కాలనీలో ఉంచి అంత్యక్రియలు జరిపినట్ల యితే తమ కాలనీకి అరిష్టం జరుగుతుందంటూ మృతదేహాన్ని ఇంటి ముందు ఉంచకుండా పంపేశారు. దీంతో గత్యంతరం లేక తుర్క యంజాల్ మాసాబ్ చెరువు వద్ద టెంట్‌ను ఏర్పాటు చేసుకొని మృతదేహాన్ని అక్కడే ఉంచారు. ఈ సమాచారం ఆదిభట్ల ఎస్‌ఐ మోహన్‌రెడ్డి వెంటనే చేరుకొని మాలతి అద్దెకు ఉంటున్న ఇంటివద్దకే మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు.
మృతదేహాన్ని అడ్డుకున్న కాలనీవాసులు
Published Sun, Nov 19 2017 3:05 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment