
తెలంగాణ వచ్చిన మూడున్నరేళ్లలో అప్పుల భారం రెట్టింపైందని కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి అన్నారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వచ్చిన మూడున్నరేళ్లలో అప్పుల భారం రెట్టింపైందని కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్తాయిలో అప్పుల పెరుగుదల 33 శాతంగా ఉంటే తెలంగాణలో 71 శాతానికి మించి ఉందన్నారు.
దేశంలోనే అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే అన్నారు. రాష్ట్ర తలసరి అప్పుల భారం రూ.40 వేలుగా ఉందని, 2018 చివరి నాటికి పుట్టబోయే వారికి అది రెట్టింపు అవుతుందన్నారు. ప్రభుత్వం ఆర్భాటాలకు పోతూ రాష్ట్రాన్ని అప్పుల వూబిలో నెడుతోందని విమర్శించారు. అప్పుల తిప్పల నుంచి గట్టెక్కించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.