టీఆర్‌ఎస్‌కు నీతి, నిజాయితీ లేదు: సంపత్‌ | congress mla sampath kumar slams trs | Sakshi

టీఆర్‌ఎస్‌కు నీతి, నిజాయితీ లేదు: సంపత్‌

Published Thu, Jul 6 2017 2:09 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

టీఆర్‌ఎస్‌ నీతి, నిజాయితీ లేని పార్టీ అని ఇప్పటికి చాలాసార్లు రుజువైంది.

హైదరాబాద్‌: తెలంగాణ బిల్లు పాస్‌ చేసే క్రమంలో అప్పటి స్పీకర్‌ మీరాకుమార్‌ కృషి మరవలేనిదని.. ఆమె కృషికి కృతజ్ఞతగానైనా రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమెకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్‌కు చేతులు జోడించి అడుగుతున్నా.. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని బీజేపీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టొద్దని ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ అన్నారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు కేసీఆర్‌ ఎన్డీఏ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు.
 
టీఆర్‌ఎస్‌ నీతి, నిజాయితీ లేని పార్టీ అని ఇప్పటికి చాలాసార్లు రుజువైంది. మీరాకుమార్‌కు ఓటు వేయకపోతే టీఆర్‌ఎస్‌ నియ్యతు లేని పార్టీ అని రుజువవుతుంది. మీరాకుమార్‌కు మద్దతు కూడగట్టేందుకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను సంప్రదిస్తున్నా. ఇప్పటికే 38 మంది ప్రజాప్రతినిధులు మీరాకుమార్‌కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అందులో టీఆర్ఎస్ వాళ్లే ఎక్కువగా వున్నారు. ఓట్లు వేసే సమయానికి తొంభైశాతం ప్రజాప్రతినిధులు ఆత్మప్రబోధానుసారం మీరాకుమార్‌కు ఓటు వేసే అవకాశం ఉందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement