
కాంగ్రెస్, టీడీపీలకు కాలం చెల్లింది
కాంగ్రెస్, టీడీపీలకు కాలం చెల్లిందని, ఆ పార్టీలతో రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు.
‘ఖేడ్’లోనూ విజయం మాదే: కవిత
జగిత్యాల జోన్: కాంగ్రెస్, టీడీపీలకు కాలం చెల్లిందని, ఆ పార్టీలతో రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సాధించిన అఖండ విజయంతో ప్రతిపక్ష పార్టీలు చిత్తయ్యూయని అన్నారు. నారాయణఖేడ్ ఉపఎన్నికల్లో సైతం ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టనున్నారని ధీమా వ్యక్తం చేశారు.
గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు డిపాజిట్లకూ నోచుకోలేదని, రేపు ఖేడ్‌లోనూ అదే పునరావృతం అవుతుందని అన్నారు. అన్ని ఎన్నికల్లో విజయదుందుభి మోగించి తెలంగాణలో ఎదురులేని పార్టీగా టీఆర్‌ఎస్ ఆవిర్భవించదన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారని చెప్పారు. కరువు సహాయ నిధుల విడుదల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.