డి-లింక్‌తో సర్కారు ఎంవోయూ
సాక్షి, హైదరాబాద్: వైర్‌లెస్ ఇంటర్నెట్ పరికరాల తయారీలో పేరొందిన డి-లింక్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తైవాన్ పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో సంస్థ సీఈవో ఓసియో, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఎంవోయూపై శుక్రవారం సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తాజా ఎంవోయూ ద్వారా తెలంగాణలో డి-లింక్ సంస్థ రూ.350 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుందని చెప్పా రు.
సుమారు వెయ్యికిపైగా ఉద్యోగావకాశాలు ప్రత్యక్షంగా, వేల సంఖ్యలో ఉపాధి అవకాశా లు పరోక్షంగా తెలంగాణ యువతకు దక్కనున్నట్లు తెలిపారు. ఎంవోయూ మేరకు డి-లింక్ సంస్థ తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో విస్తరించనుందని వెల్లడించారు. నెట్‌వర్కింగ్ శిక్షణా కేంద్ర ం పేరిట ఒక అకాడమీ ఏర్పాటు చేసి యువతకు శిక్షణ, ఉద్యోగాల కల్పన చేపట్టనున్నట్లు వివరించారు. వైఫై సేవలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలతో వైర్‌లెస్ సేవలను అందించనుందని తెలిపారు.
న్యూ కిన్సో కంపెనీకి స్వాగతం..
ఎక్విప్‌మెంట్ తయారీలో అగ్రగామిగా ఉన్న న్యూకిన్సో కంపెనీ సీఈవో సిమెన్ షెన్‌తో భేటీ అయిన మంత్రి కేటీఆర్ సంస్థ ప్రతినిధులను హైదరాబాద్‌కు ఆహ్వానించారు. అనంతరం వోల్‌ట్రెక్ కంపెనీ ప్రెసిడెంట్ జేమ్స్ చెన్‌తో సమావేశమైన మంత్రి.. హైదరాబాద్‌లో వోల్‌ట్రెక్ కంపెనీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పం దించిన జేమ్స్.. తమ బృందాన్ని త్వరలో హైదరాబాద్‌కు పంపుతామని హామీ ఇచ్చారు.
ఇండియా-తైవాన్ కోఆపరేషన్ ఫోరమ్ సమావేశానికి హాజరైన ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతి నిధులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగిం చారు. తెలంగాణలో పెట్టుబడుల పెట్టేందుకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక విధానాలను వివరించారు.